Advertisement

నిహారిక పెళ్లి.. చిరు ఎమోషనల్‌ ట్వీట్‌

Posted : December 8, 2020 at 3:17 pm IST by ManaTeluguMovies

మెగా డాటర్‌ నిహారిక వివాహంకు రంగం సిద్దం అయ్యింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ దాదాపు అంతా కూడా రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ కు చేరుకున్నారు. అక్కడ నిన్న రాత్రి సమయంలో భారీ ఎత్తున సంగీత్‌ కార్యక్రమం జరిగింది. కాబోయే జంట నుండి మొదలుకుని చిరంజీవి వరకు అంతా కూడా సంగీత్‌ కార్యక్రమంలో పాల్గొని డాన్స్‌ చేశారు. సంగీత్‌ లో భాగంగా మెగా ఫ్యామిలీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిహారిక పెళ్లి వేడుకల్లో కనిపిస్తున్నాడు.

ఇప్పటికే నిహారికతో ఫొటోను షేర్‌ చేసిన చిరంజీవి నేడు మరో ట్వీట్‌ లో నిహారికపై తనకు ఉన్న అభిమానంను ప్రేమను చాటుకున్నాడు. ”మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు” అంటూ ట్వీట్‌ చేశాడు. చిరంజీవి ని నిహారిక డాడీ అంటూ పిలుస్తుందనే విషయం తెల్సిందే. సుష్మిత మరియు శ్రీజల మాదిరిగానే నిహారికను కూడా తాను కూతురుగా చూసుకున్నాను అంటూ గతంలో చెప్పిన చిరంజీవి ఈ పెళ్లికి కోట్ల విలువ చేసే బహుమానంను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

కె-4 బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం | India Successfully Tests K-4 Nuclear-Capable Missile

Posted : November 29, 2024 at 8:50 pm IST by ManaTeluguMovies

కె-4 బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం | India Successfully Tests K-4 Nuclear-Capable Missile

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad