కాగా నటుడు నాగబాబు కుమార్తె నిహారిక- జొన్నలగడ్డ వెంకట చైతన్య బుధవారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. మెగా కుటుంబమంతా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ క్రమంలో నిశ్చయ్ జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.