ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రూమర్స్ పై మెగా డాటర్ ఆనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి.!

సినిమా – ఇదొక రంగుల ప్రపంచం. ఈ రంగుల వెనక అందరికన్నా ఎక్కువ కష్టం ఉంటుంది కానీ అవేమి చూడకుండా రంగుల్ని మాత్రమే చూసి వారిని జడ్జ్ చేస్తుంటారు. అందుకేనేమో ఇక్కడ హీరో, హీరోయిన్, డైరెక్టర్, నటీనటులు, టెక్నీషియన్స్ ఇలా ఎవరిమీదైనా రూమర్స్ ఈజీగా వచ్చేస్తుంటాయి. పలువురు ఈ రూమర్స్ పై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతుంటారు, మరి కొందరు అస్సలు పట్టించుకోరు, కొందరు భలే ఉందే ఈ రూమర్ అని ఎంజాయ్ కూడా చేస్తుంటారు.

చాలా మంది హీరోలు, హీరోయిన్స్ కెరీర్ ప్రారంభంలో ఈ రూమర్స్ ని ఎదుర్కోవడానికి పలు ఇబ్బందులు పడి ఆ తర్వాత స్ట్రాంగ్ అవుతారు. అలానే కెరీర్ తొలినాళ్లలోనే పలు విమర్శలు ఎదుర్కొన్న మెగా డాటర్ నిహారిక రూమర్స్ ని ఎలా తీసుకుంటారు అని అడిగితే.. ‘సినిమాల్లోకి రాకముందు చాలా రూమర్స్ చూసే దాన్ని.. అప్పుడు ఎంతో కొంత నిప్పు ఉంటేనే కదా పొగొస్తోంది అని అనుకునేదాన్ని. ఇండస్ట్రీలోకి వచ్చాక ఎప్పుడైతే నేను నా గురించి పలు రూమర్స్ విన్నానో అప్పుడర్థమైంది ఇక్కడ నిప్పులేకుండా పొగని క్రియేట్ చేస్తున్నారని, అప్పటి నుంచీ నాపై వచ్చే రూమర్స్ ని చూసి బాగా నవ్వుకుంటాను. అలాగే నా ఫ్రెండ్స్ పంపే కొన్ని మీమ్స్ ని కూడా ఎంజాయ్ చేస్తానని’ నిహారిక తెలిపింది.

ఇండస్ట్రీలోకి రాకముందు అందరిలానే నిహారిక రూమర్స్ పై ఒకటి అనుకుంటే, ఇండస్ట్రీలోకి వచ్చాక అర్థమైంది తను అనుకున్నదొకటి ఇక్కడ అవుతున్నదొకటని. లాక్ డౌన్ తర్వాత నిహారిక ఓ తమిళ సినిమాలో మోడ్రన్ గర్ల్ పాత్రలో నటించనుంది. అలాగే తెలుగులో కూడా కొన్ని కథలు ఫైనల్ చేయాల్సి ఉంది.

Exit mobile version