ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నిహారిక పెళ్లి సంబంధం కుదిర్చిన మెగాస్టార్.!!

మెగా డాటర్ నిహారిక పెళ్లి టాపిక్ ఇప్పడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఈ విషయాన్ని నిహారికనే స్వయంగా ఖరారు చేసింది. నాగబాబు కొద్దీ రోజుల క్రితం ఇంకో ఏడాదిలో నిహారిక పెళ్లి ఉంటుందని అన్నారు. కానీ అలా అన్న కొద్ది రోజుల్లోనే ఇదంతా ఎలా జరిగిపోయింది.? అనే విషయాలు తెలుసుకోవాలని ట్రై చేసిన మాకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి..

నిహారిక పెళ్లి ఫిక్స్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారేనట.. అవును మీరు విన్నది నిజమే.. మాములుగా నిహారిక చిరంజీవిని డాడీ అని పిలుస్తుంటుంది. చిరు కూడా నిహారికని సొంత కూతురులానే చూస్తారు. అందుకే తన పెళ్లి బాధ్యతలు కూడా తీసుకొని ఈ పెళ్లి సెట్ చేసాడట. అసలు ఈ పెళ్ళికి సంబందించి ఏం జరిగింది అనే ఇన్ సైడ్ స్టోరీ లోకి వెళితే..

వరుడు చైతన్య అమ్మగారైన జె. పద్మ గారి తండ్రిగారైన గుణ వెంకటరత్నం గారు, చిరంజీవి తండ్రిగారైన కొణిదెల వెంకట రావు గారు అప్పట్లో మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం వలన జె. పద్మగారి పెళ్ళైన నాటి నుంచే చిరంజీవికి, చైతన్య ఫాదర్ జె. ప్రభాకర్ రావు మధ్య మంచి స్నేహం కుదిరింది. ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ కుటుంబ బాగోగులు మాట్లాడుకుంటుంటారు చిరంజీవి అండ్ జె. ప్రభాకర్ రావు. కొద్దిరోజుల క్రితం ప్రభాకర్ రావు గారు మాటల్లో మాటగా తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను అని చిరుతో అన్నారు. ఆ తర్వాత ఈ విషయం గురించి బాగా ఆలోచించిన చిరంజీవి ఎవరికో ఎందుకు తన కుమార్తె నిహారికని ఇచ్చి చేస్తే అన్ని విధాలా బాగుంటుందని భావించి చిరంజీవినే ఈ పెళ్లి ప్రపోజల్ ని ప్రభాకర్ రావు వద్దకు తీసుకెళ్లారట. ఇన్నేళ్ల స్నేహం బంధుత్వంగా మారడం కంటే ఆనందం ఏముందని జె. ప్రభాకర్ రావు కూడా వెంటనే ఈ పెళ్ళికి అంగీకరించారట. అలా కొణిదెల ఇంటి పెద్దగా, తన సొంత కూతురిలానే అన్ని విధాలా ఆలోచింది మంచి కుటుంబంలోకి నిహారికకు పంపడానికి ఈ పెళ్లి సంబంధాన్ని కుదిర్చారు చిరంజీవి.

స్వతహాగానే చిరంజీవి నిత్యం తన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ బాగోగులు చూసుకునే మెగాస్టార్ చిరంజీవి, ఎప్పటికప్పుడు వారికే ఏ అవసరమున్నా అయన తీరుస్తారని, ఏ సమస్య ఉన్న ముందుండి పరిష్కరిస్తారని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. మెగాస్టార్ కుటుంబం పట్ల చూపే ప్రేమానురాగాలకు ఇప్పుడు ఆయన కుదిర్చిన నిహారిక పెళ్లి ఓ చక్కని ఉదాహరణ. ఇంటిపెద్దగానే కాదు ఇండస్ట్రీ పెద్దగా కుడా ముందుండి ఇటీవల ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి సినిమా షూటింగ్స్ కి అనుమతులు తీసుకొచ్చారు, అలాగే సినీ ఇండస్ట్రీ బాగోగుల కోసం కృషి చేస్తున్నారు.

Exit mobile version