ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఆచార్యలో మెగా సిస్టర్‌ పాత్రపై మెగా కాంపౌడ్‌ క్లారిటీ

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య గురించి రోజుకో వార్త మీడియాలో ఉంటుంది. సోషల్‌ మీడియాలో లేదంటే ఇండస్ట్రీ వర్గాల్లో ఏదో ఒక చిన్న పుకారు రావడం మీడియాలో పెద్ద ఎత్తున దాని గురించి ప్రచారం జరగడం చాలా కామన్‌ అయ్యింది. తాజాగా ఆచార్య చిత్రం గురించిన ఒక పుకారు అందరి దృష్టిని ఆకర్షించింది. అదే నిహారిక ఈ చిత్రంలో నటించబోతుంది.. అది కూడా రామ్‌ చరణ్‌కు చెల్లి పాత్రలో. చనిపోయిన తన అన్న గురించి చిరంజీవికి ఆమె చెబుతుందని కథ కూడా రివీల్‌ అయ్యింది.

అసలు విషయంపై మెగా వర్గాల వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆచార్యలో ఇంకా చరణ్‌ నటిస్తున్నది లేనిది క్లారిటీ రాలేదు. అలాంటిది అప్పుడే చరణ్‌ పాత్రకు చెల్లి ఆమె గురించి కథ ఏంటీ అంటూ పుకార్లను కొట్టి పారేశారు. సైరా చిత్రంలో పాత్రకు అవసరం కనుక నిహారికను నటింపజేశారు. అంతే తప్ప కావాలని సినిమాల్లో ఏ ఒక్కరిని బలవంతంగా జొప్పించలేరని, ఆచార్యకు నిహారిక అవసరం అయితే తప్పకుండా ఆయన ఎంపిక చేసుకుంటాడు. కాని ప్రస్తుతానికి మాత్రం ఆమెను కనీసం సంప్రదించను లేదని అంటున్నారు.

హీరోయిన్‌గా ప్రయత్నించిన నిహారి కమర్షియల్‌గా సక్సెస్‌ దక్కించుకోలేక పోయింది. నటిగా మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. కనుక ఇకపై హీరోయిన్‌గా కాకుండా లక్ష్మి మంచు మాదిరిగా కీలక పాత్రల్లో నటించాలని ఫిక్స్‌ అయ్యిందట. అందుకే ఆచార్యలో నటించబోతుందని అనుకున్నారు. కాని ఆచార్యలో నిహారిక లేదని క్లారిటీ రావడంతో అంతా ఉసూరుమంటున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలయ్యేది చెప్పలేని పరిస్థితి.

Exit mobile version