ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నిఖిల్ కు భారీ జరిమానా

కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు దారుణంగా పెరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన విషయం తెల్సిందే. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ వెసులుబాటును కల్పించారు. ఈ లాక్ డౌన్ ఈ నెల 9 వరకూ ఉంటుందని తెలియజేసారు.

ఇదిలా ఉంటే నటుడు నిఖిల్ లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించాడని పేర్కొంటూ హైదరాబాద్ పోలీసులు భారీ జరిమానా విధించారు. అలాగే ఆయన కార్ నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేదంటూ మరో చలాన్ ను పంపారు.

నిబంధనల ఉల్లంఘన సమయంలో నిఖిల్ కార్ లో లేడని ధృవీకరించారు పోలీసులు. ఇటీవలే నిఖిల్ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తను నటిస్తోన్న 18 పేజెస్ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version