ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

లాక్‌డౌన్‌లోనే వెడ్‌ లాక్‌ అవ్వబోతున్న టాలీవుడ్‌ హీరో

గత నెలలో జరగాల్సిన హీరో నిఖిల్‌ వివాహం కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ విషయం తెల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. కొంత కాలం వెయిట్‌ చేయబోతున్నట్లుగా ఆమద్య ప్రకటించిన నిఖిల్‌ ఎట్టకేలకు మళ్లీ పెళ్లికి సిద్దం అయ్యాడు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, సామాజిక దూరం పాటిస్తూ రేపు నిఖిల్‌ వివాహం జరుగబోతుంది. ప్రేమించిన పల్లవి మెడలో హీరో నిఖిల్‌ తాళి కట్టేందుకు రెడీ అయ్యాడు.

హైదరాబాద్‌ శివారులో ఉండే ఒక ప్రైవేట్‌ విల్లాలో ఈ వివాహంను జరిపేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. వచ్చే బంధువులకు మరియు స్నేహితులకు పోలీసు వారి నుండి అనుమతులు తీసుకోవడం జరిగింది. రేపు ఉదయం 6 గంటల 31 నిమిషానికి నిఖిల్‌ వివాహం జరుగబోతుంది. సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎవరు కూడా ఈ పెళ్లికి హాజరు అవ్వబోవడం లేదని తెలుస్తోంది.

ఇప్పట్లో కరోనా తగ్గేలా లేదని, అలాగే వ్యాక్సిన్‌ వచ్చే వరకు లాక్‌ డౌన్‌ అమలులో ఉండటం లేదంటే ఆంక్షలు ఉండటం జరుగుతుందని భావించిన నిఖిల్‌ ఫ్యామిలీ ఇక ఆలస్యం చేయకూడదనే ఉద్దేశ్యంతో నిఖిల్‌ వివాహంను ఫిక్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా ఎలాంటి వేడుకలు నిర్వహించబోవడం లేదని నిఖిల్‌ కుటుంబ సభ్యులు ప్రకటించారు.

Exit mobile version