ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ తో సీఎస్‌ నీలం సాహ్ని భేటీ

ఏపీలో ఈ ఏడాది ఆరంభంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డ విషయం తెల్సిందే. ఆ వాయిదా నిర్ణయం రాజకీయంగా చాలా దుమారం రేపింది. ఏపీ ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆయన్ను తొలగించి కొత్త ఈసీని కూడా ఎంపిక చేయడం జరిగింది. కాని నిమ్మగడ్డ రమేష్‌ కోర్టుకు వెళ్లి మళ్లీ పోస్టింగ్‌ తెచ్చకున్నాడు. ఇదంతా కూడా జరిగిపోయిన విషయం. ఇప్పుడు మళ్లీ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మరియు నిమ్మగడ్డ రమేష్‌ ఎన్నికల విషయమై చర్చలు జరిపారు. ఎన్నికలు జరపాలని ప్రజలు కోరుకుంటున్నారా ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిపితే పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయమై కూడా ఆరోగ్య శాఖతో నిమ్మగడ్డ చర్చలు జరిపారు. కోవిడ్‌ పరిస్థితుల గురించి చర్చించిన నిమ్మగడ్డ మరియు నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణ విషయమై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారట. ఈసీ మరియు సీఎస్‌ మద్య జరిగిన చర్చతో ఎన్నికల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version