ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కరోనా సెకెండ్ వేవ్: కొత్త ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం.!

కోవిడ్ ప్రభావిత రంగాలకు 1.1 లక్షల కోట్ల రుణ హామీ.. వైద్య రంగానికి 50 వేల కోట్ల కేటాయింపు.. ఇతర రంగాలకు మరో 60 కోట్ల కేటాయింపు.. వైద్య, ఆరోగ్య శాఖకు సాయం చేసే సంస్థలకు అండగ.. వైద్య, ఔషధ రంగాల్లో మౌళిక వసతుల అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులకు రుణం, ఎమర్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కింద అత్యవసర రుణాలకు అదనంగా మరో 1.5 లక్షల కోట్లు.. సూక్ష్మ సంస్థల ద్వారా 25 లక్షల మందికి 1.25 లక్షల రుణం.. పర్యాటక రంగానికి, వివిధ రంగాలకు రుణాలు.. ఇవన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించిన ‘సెకెండ్ వేవ్ ఆర్థిక ప్యాకేజీ’ భాగం.

కరోనా మొదటి వేవ్ సందర్భంగా ఆత్మ నిర్భర భారత్ పేరుతో కేంద్రం ఓ ప్యాకేజీ ప్రకటించిన విషయం విదితమే. అలాంటిదే ఇది కూడా. రెండో వేవ్ నేపథ్యంలో ఈ ప్యాకేజీ ప్రకటించారన్నమాట. ఇంతకీ, మొదటి వేవ్ సందర్భంగా ప్రకటించిన ప్యాకేజీతో సామాన్యుడికి దక్కిందేంటి.? అంటే, దక్కినదానికన్నా దోచిందే ఎక్కువ.. అని చెప్పక తప్పదు. ఎందుకంటే, పెట్రో ధరలు దేశవ్యాప్తంగా కనీ వినీ ఎరుగని స్థాయిలో పెరుగుతున్నాయి.. అయినా, కేంద్రం వాటిని అదుపు చేయడంలేదు. సెంచరీ దాటేసింది పెట్రోల్ ఎప్పుడో.. చాలా రాష్ట్రాల్లో డీజిల్ కూడా సెంచరీ దాటేసింది. ఈ రెండు ధరలు అదుపులో లేకపోతే.. సామాన్యుడి పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక, రాష్ట్రాలు కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ స్కీము ద్వారా పొందిన లబ్ది ఏంటి.? అన్న ప్రశ్నకు ఆయా రాష్ట్రాల దగ్గరే సరైన సమాధానం వుంది. కేంద్రం పూర్తిగా చేతులెత్తేసిందని ఇప్పటికే చాలా రాష్ట్రాలు కేంద్రంపై మండిపడుతున్నాయి. చిత్రమేంటంటే, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఆత్మ నిర్భర భారత్ వ్యవహారంపై పెదవి విరుస్తున్న పరిస్థితి. ఎవరి కోసం ఈ ప్యాకేజీలు.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వ పెద్దలది. పబ్లిసిటీ పీక్స్.. మేటర్ మాత్రం చాలా వీక్.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇలాగేనా.?

కరోనా పాండమిక్ నేపథ్యంలో దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వేళ, సామాన్యుడ్ని ఆదుకునేందుకు కష్టమైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి.. ‘రుణాలు..’ అంటూ పబ్లిసిటీ స్టంట్లు చేయడమేంటి.?

Exit mobile version