ఇప్పటికే పలుసార్లు నిశ్శబ్దం సినిమాని ఓటిటి లో రిలీజ్ చేస్తారు అనే వార్తలు వచ్చినా ఈ చిత్ర నిర్మాత కోన వెంకట్ మాత్రం ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు.. థియేటర్స్ కి అనుమతులు బాగా లేట్ అయితే అప్పుడు ఆలోచిస్తాం అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మరో 2 లేదా 3 నెలలు థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేదు. దాంతో ఈ చిత్ర టీం ఓటిటి విడుదలకి వెళ్ళడానికే డిసైడ్ అయ్యిందని సమాచారం. బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటిటి కి క్యూ కట్టడంతో నిశ్శబ్దం నిర్మాతలు కూడా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మరో మూడు నాలుగు రోజుల విజువల్స్ ఎఫెక్ట్స్ పనులు తప్ప మిగతా అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలోనే అవీ పూర్తి చేసి ఫస్ట్ కాపీ తో ఓటిటి డీల్ కి ఆఫర్ ఇస్తారు. ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ ఎక్కువ ఆఫర్ చేస్తే వారికి ఇవ్వడానికే నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. మరి ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఆగష్టు లో రిలీజ్ అనుకున్న నిశ్శబ్దం సినిమా తెలుగు నుంచి డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అవుతున్న మొదటి భారీ బడ్జెట్ చిత్రం కానుండడం విశేషం. హేమంత్ మధుకర్ డైరెక్టర్.