నిశబ్దం చిత్రాన్ని థియేటర్లలో ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేని కారణంగా అమెజాన్ భారీ మొత్తం ఆఫర్ చేయడంతో నిర్మాత సినిమాను అమ్మేసినట్లుగా తెలుస్తోంది. మరో మూడు నాలుగు రోజుల్లో అమెజాన్‌లో నిశబ్దం స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. చిన్న సినిమాలు ఇప్పటికే డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కనుక ఈ సినిమాను కూడా ఓటీటీలో ప్రసారం చేసేందుకు రంగం సిద్దం అయ్యిందని అంతా అనుకున్నారు.
మీడియాలో వస్తున్న ఈ వార్తలపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. కాస్త ఆలస్యం అయినా కూడా నిశబ్దం చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. నిశబ్దం చిత్రంతో అనుష్క మరో భారీ బ్లాక్ బస్టర్‌ను దక్కించుకుంటుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇదో విభిన్నమైన సినిమా అని అనుష్క తన నటనతో అద్బుతంగా ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
Please do not believe in any baseless rumours you come across. 😊 #Nishabdham#AnushkaShetty @ActorMadhavan @yoursanjali @hemantmadhukar #TGVishwaprasad @konavenkat99 @vivekkuchibotla @peoplemediafcy @KonaFilmCorp @GopiSundarOffl @MangoMusicLabel @nishabdham pic.twitter.com/q7fFaIVBUr
— People Media Factory (@peoplemediafcy) April 21, 2020