ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నితిన్‌ ‘అంధాదున్‌’ వచ్చేది ఎప్పుడంటే

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ అంధాదున్‌ ను తెలుగులో నితిన్‌ హీరోగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. నితిన్‌ హోం బ్యానర్‌ లో రీమేక్‌ అవుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒరిజినల్‌ వర్షన్‌ లో టబు పోషించిన పాత్రను ఈ సినిమాలో టబు చేస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా నభ నటేష్‌ నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల కాలంలో సినిమా విడుదల తేదీలకు సంబంధించి వరుసగా తేదీలు ప్రకటించారు. కనుక నితిన్‌ రీమేక్‌ విడుదల తేదీని కూడా ఫిక్స్‌ చేస్తున్నట్లుగా ప్రకటించి అన్నట్లుగానే నేడు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. జూన్‌ 11వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అనౌన్స్‌మెంట్‌ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు టైటిల్‌ ఏంటీ అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. నితిన్‌ అంధుడి పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా అత్యంత విభిన్నంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో ఉంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. మహతి సాగర్‌ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శ్రీముఖ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Exit mobile version