Advertisement

‘చిత్రం 2’ చేయబోతున్నది ఈ నితిన్ కాదు ఆ నితిన్‌?

Posted : June 28, 2021 at 10:27 am IST by ManaTeluguMovies

తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్‌ హీరోగా పరిచయం అయిన చిత్రం సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా ఇప్పటికి యూత్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకుంటూనే ఉంటుంది. అలాంటి సినిమాకు సీక్వెల్‌ అంటే అంచనాలు ఖచ్చితంగా భారీగా ఉంటాయి. చిత్రం సీక్వెల్‌ ను తేజ ప్రకటించి చాలా కాలం అవుతుంది. కాని ఇప్పటి వరకు కరోనా కారణంగా ఒక్క అడుగు ముందుకు పడుతున్నట్లుగా కనిపించడం లేదు. ఈ సమయంలోనే హీరోగా నటించబోతున్నది ఎవరు అనే వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.

నిన్న మొన్నటి వరకు నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దాంతో అంతా కూడా ఇప్పటికే హీరోగా ఉన్న జయం నితిన్ అనుకున్నారు. కాని చిత్రం 2 లో నటించబోతున్నది జయం నితిన్ కాదని ఎన్టీఆర్‌ బావమర్ధి నితిన్ నార్నే అని చెబుతున్నారు. ఎన్టీఆర్‌ ఒక్కగానొక్క బావమర్ధిని ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తేజ చెప్పిన కథ అందరికి నచ్చడంతో నితిన్ ను పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Advertisement

Recent Random Post:

All in One Super Entertainer Promo – 17th April 2024 – Rashmi Gautam,Suma Kanakala,Indraja,Aadi

Posted : April 17, 2024 at 7:14 pm IST by ManaTeluguMovies

All in One Super Entertainer Promo – 17th April 2024 – Rashmi Gautam,Suma Kanakala,Indraja,Aadi

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement