Advertisement

నితిన్ ‘మాస్ట్రో’ నుంచి సరికొత్త పాట..!

Posted : September 6, 2021 at 9:45 pm IST by ManaTeluguMovies

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ”మాస్ట్రో”. ఇందులో నభా నటేష్ హీరోయిన్ గా నటించగా.. మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్ర పోషించారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. తాజాగా చిత్రంలోని ‘లల్లల్లాల’ అనే మరో పాటని రిలీజ్ చేశారు.

‘హార్టెమో కొట్టుకుంది గోడకే.. వేలాడుతున్న గడియారంలా.. పల్సేమో పెరుగుతుంటే స్పీడుగా.. పరిగెత్తే మైండే రైల్ ఇంజన్ లా..’ అంటూ సాగిన ఈ సాంగ్ కు మహతి స్వర సాగర్ ట్యూన్ కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. ధనుంజయ శ్రీపాన తనదైన శైలిలో ఆలపించారు. ఈ పాటలో నితిన్ – తమన్నా భాటియా కనిపిస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయగా.. SR శేఖర్ ఎడిటింగ్ వర్క్ చేశారు. జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు.

‘మాస్ట్రో’ చిత్రంలో అంధుడైన ఓ పియానో ప్లేయర్ రోల్ లో నితిన్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – టీజర్ – ట్రైలర్ – సాంగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇది 2018లో హిందీలో వచ్చిన ‘అంధాధున్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అవడమే కాకుండా.. అనేక అవార్డులు అందుకుంది. మరి తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ – జిషుసేన్ గుప్తా – శ్రీముఖి – అనన్య – హర్షవర్ధన్ – రచ్చ రవి – మంగ్లీ – శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.


Advertisement

Recent Random Post:

Botsa Satyanarayana Gets Emotional Over Jagan Comments | YSRCP | AP Elections 2024

Posted : April 24, 2024 at 12:42 pm IST by ManaTeluguMovies

Botsa Satyanarayana Gets Emotional Over Jagan Comments | YSRCP | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement