Advertisement

నితిన్ పెళ్లికి రంగ్ దే టీజర్

Posted : July 24, 2020 at 3:55 pm IST by ManaTeluguMovies

హీరో నితిన్ పెళ్లి కానుకగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ రంగ్ దే టీజర్ అందించాలని చూస్తోంది. ఓ హీరో పెళ్లికి ఇంతకన్నా మంచి కానుక మరోటి వుండదు కదా? అందుకే రెండు రోజుల్లో జరగబోయే నితిన్ పెళ్లికి టీజర్ కానుక ఇవ్వాలని రంగ్ దే బృందం ట్రయ్ చేస్తోంది.

దర్శకుడు వెంకీ అట్లూరి, సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్, మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఇదే పని మీద వున్నారు. అంతా ఓకె. బాగానే వుంది కానీ టీజర్ లో ఒకటో రెండో డైలాగులు వుంటాయి. అవి డబ్బింగ్ చెప్పాలి అంటే నితిన్ కనీసం ఓ రెండు గంటలు ఖాళీ చేసుకోవాలి.

రెండు రోజుల్లో ఫెళ్లి పెట్టుకుని, నితిన్ డబ్బింగ్ కు రావడం అంటే అంత వీజీ కాదు. కానీ చెబుతానని నితిన్ మాట ఇచ్చినట్లు బోగట్టా. ఆ ఒక్క పని మినహా మిగిలినదంతా ఫినిష్ చేసుకుని, రెడీగావుండాలని టీమ్ ప్రయత్నిస్తోంది.

ఇదిలా వుంటే కరోనా వ్యవహారం సద్దుమణిగితే సెప్టెంబర్ నుంచి రంగ్ దే షూట్ స్టార్ట్ చేస్తారు. చిన్న షెడ్యూలు ఒకటి న్యూజిలాండ్ లో వుంటుంది. ఇక్కడ జోక్ ఏమిటంటే, ఈ చిన్న షెడ్యూలు కోసం ఇరవై ముఫై మంది టీమ్ ప్రయివేట్ జెట్ లో న్యూజిలాండ్ కు వెళ్తారని వార్తలు రావడం. ఇదేమన్నా ఆర్ఆర్ఆర్ నా ప్రయివేట్ జెట్ వేసుకుని షూటింగ్ కు వెళ్లడానికి. మామూలుగా హీరో బిజినెస్ క్లాస్ లోనూ, మిగిలిన వారు మామూలుగానూ న్యూజిలాండ్ వెళ్లి షూటింగ్ చేసుకుని వస్తారు.


Advertisement

Recent Random Post:

Introducing Ashwatthama – Kalki 2898 AD | Amitabh | Prabhas | Kamal Haasan | Deepika | Nag Ashwin

Posted : April 22, 2024 at 2:08 pm IST by ManaTeluguMovies

Introducing Ashwatthama – Kalki 2898 AD | Amitabh | Prabhas | Kamal Haasan | Deepika | Nag Ashwin

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement