దర్శకుడు వెంకీ అట్లూరి, సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్, మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఇదే పని మీద వున్నారు. అంతా ఓకె. బాగానే వుంది కానీ టీజర్ లో ఒకటో రెండో డైలాగులు వుంటాయి. అవి డబ్బింగ్ చెప్పాలి అంటే నితిన్ కనీసం ఓ రెండు గంటలు ఖాళీ చేసుకోవాలి.
రెండు రోజుల్లో ఫెళ్లి పెట్టుకుని, నితిన్ డబ్బింగ్ కు రావడం అంటే అంత వీజీ కాదు. కానీ చెబుతానని నితిన్ మాట ఇచ్చినట్లు బోగట్టా. ఆ ఒక్క పని మినహా మిగిలినదంతా ఫినిష్ చేసుకుని, రెడీగావుండాలని టీమ్ ప్రయత్నిస్తోంది.
ఇదిలా వుంటే కరోనా వ్యవహారం సద్దుమణిగితే సెప్టెంబర్ నుంచి రంగ్ దే షూట్ స్టార్ట్ చేస్తారు. చిన్న షెడ్యూలు ఒకటి న్యూజిలాండ్ లో వుంటుంది. ఇక్కడ జోక్ ఏమిటంటే, ఈ చిన్న షెడ్యూలు కోసం ఇరవై ముఫై మంది టీమ్ ప్రయివేట్ జెట్ లో న్యూజిలాండ్ కు వెళ్తారని వార్తలు రావడం. ఇదేమన్నా ఆర్ఆర్ఆర్ నా ప్రయివేట్ జెట్ వేసుకుని షూటింగ్ కు వెళ్లడానికి. మామూలుగా హీరో బిజినెస్ క్లాస్ లోనూ, మిగిలిన వారు మామూలుగానూ న్యూజిలాండ్ వెళ్లి షూటింగ్ చేసుకుని వస్తారు.