ఒక్క సారి టబ్ దిగిన తర్వాత ఆమెను డిస్ క్వాలిఫై చేయాల్సి ఉంది. కాని సోహెల్ అలా చేయలేదని అవినాష్ అన్నాడు. ఆ సమయంలో సోహెల్ కూడా ఎదురు దాడికి దిగడంతో పాటు సేఫ్ గేమ్ అంటూ మాట రావడంతో అవినాష్ కు కోపం తీవ్రంగా వచ్చింది. ఇన్ని రోజులు నవ్వుతు నవ్విస్తూ ఉన్న అవినాష్ సేఫ్ గేమ్ అనగానే తీవ్రంగా కోపంతో ఊగిపోయాడు. అవును అందరితో బాగుండేందుకు సేఫ్ గేమ్ ఆడుతాను అంటూనే టాస్క్ విషయంలో నేను ఎప్పుడు కూడా సేఫ్ గా ఆడను అంటూ అవినాష్ చాలా గట్టి గట్టిగా సోహెల్ పై అరిచాడు. ఆ సమయంలో సోహెల్ కు కూడా కోపం వచ్చినా నాగార్జున కు ఇచ్చిన మాట ప్రకారం అక్కడ నుండి వెళ్లి పోయాడు.
బాత్ రూంలోకి వెళ్లిన సోహెల్ అక్కడ కుర్చీని బలంగా గుద్ది గట్టిగా అరిచాడు. నేను ఎంత కూల్ గా ఉంటున్నా కూడా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అతడిని అఖిల్ మరియు మెహబూబ్ లు ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత మళ్లీ డైనింగ్ టేబుల్ పై కాస్త ఎక్కువగానే చర్చ జరిగింది. సోహెల్ అప్పుడు కూడా కన్నీరు పెట్టుకోవడంతో ఇంటి సభ్యులు అంతా వచ్చి అతడిని ఓదార్చేందుకు ప్రయత్నించారు.
అమీతుమీలో నెగ్గిన జట్టుకు కెప్టెన్సీ ఫైనల్ టాస్క్ జరిగింది. తలకు ఒక బ్యాట్ కట్టుకుని తమకు చెందిన కలర్ బాల్స్ ను గోల్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ గోల్స్ వేస్తే వారు కెప్టెన్. నోయల్ గోల్స్ ఎక్కువగా వేసి విన్నర్ అయ్యి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. నోయల్ కెప్టెన్ అయినా వచ్చే వారిని ఇమ్యూనిటీ లేదు. ఎందుకంటే అమీతుమీలో భాగంగా నోయల్ సెల్ఫ్ నామినేషన్ అయ్యాడు. కనుక నోయల్ కెప్టెన్ అయినా వచ్చే వారం నామినేషన్‌లోనే ఉంటాడు అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు.