ఆయన మామలు కాళ్ల నొప్పులతో బాధపడలేదు.. ఆయనకు యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాది ఉందట. ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాది వల్ల ఎముకల పనితీరు మెల్ల మెల్లగా క్షీణిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దాని వల్ల దేహంలోని పలు అంగాలపై ప్రభావం పడుతుందట. ఈ వ్యాధి బారిన పడిన వారి నడక తీరు, నిలబడే విధానం మారిపోతుంట. ఈ వ్యాధి ప్రభావం పక్కటెముకలపై పడితే శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. కంటి చూపు కూడా ప్రభావితం అవ్వడంతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా మొదలు అవుతాయి. ఇలా శరీరం మొత్తం కూడా ఈ వ్యాది వల్ల క్షీణిస్తూ మనిషి జీవచ్చవం మాదిరిగా అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. నోయల్‌కు అత్యున్నత చికిత్స అందిస్తే ఆయన తప్పకుండా మళ్లీ మామూలు మనిషి అవుతాడని కూడా వైద్యులు చెబుతున్నారు.