యంగ్ టైగర్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన అభిమానులు ఓ యజ్ఞమే చేశారు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ సృష్టించేందుకోసం. ఈ క్రమంలో ఎవరు ఎన్టీఆర్‌కి బర్త్ డే విషెస్ చెప్పినా, దాన్ని రీ-ట్వీట్ చేయడం, లైక్ చేయడం వంటివి చేశారు. ఆ కోణంలో చూస్తే, నారా లోకేష్ ట్వీట్ సాధించిన ప్రత్యేకమైన ఘనత ఏదీ లేదన్నది సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ.
ఇక, రాజకీయాల్లో ఇంకోరకమైన చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ పేరు చెబితే తప్ప, నారా లోకేష్ ట్వీట్స్‌ని పెద్దగా ఎవరూ పట్టించుకోరనీ, చంద్రబాబు వెంటనే లోకేష్‌ని పక్కకు తప్పించి, ఎన్టీఆర్‌ని బతిమాలుకుని పార్టీని బాగు చేసుకోవాలనీ టీడీపీలోని స్వర్గీయ ఎన్టీఆర్ ఫ్యాన్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి మద్దతుగా మాట్లాడుతున్నారు.
గతంలో యంగ్ టైగర్, టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం విదితమే. అయితే, దాన్ని రాజకీయంగా వాడుకున్న చంద్రబాబు, ఆ తర్వాత ఎన్టీఆర్‌ని పూర్తిగా పక్కన పడేసిన విషయం విదితమే. యంగ్ టైగర్ ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా వున్నాడు. ఆయనకి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేకపోబట్టి చంద్రబాబు ఆటలు చెల్లుతున్నాయి.
ఒకవేళ యంగ్ టైగర్ గనుక, రాజకీయాల గురించి ఆలోచిస్తే.. టీడీపీ మొత్తం ఆయన వైపు వెళ్ళిపోవడం ఖాయమని టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. చాలామంది సీనియర్లే కాదు, యంగ్ జనరేషన్ పొలిటికల్ లీడర్స్ కూడా చంద్రబాబుపై ఎన్టీఆర్‌కి సంబంధించి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు గత కొంతకాలంగా. కానీ, చంద్రబాబు లెక్కలు వేరేలా వున్నాయ్. ఆ లెక్కలే ఇప్పుడు టీడీపీని ఈ స్థాయికి దించేశాయ్.
Warm birthday wishes to @tarak9999. May the year ahead be filled with success and happiness.
— Lokesh Nara (@naralokesh) May 20, 2020