Advertisement

ఎన్.టి.ఆర్ కి పాన్ ఇండియా ఇంపార్టెంట్ కాదట.!

Posted : May 11, 2020 at 10:58 pm IST by ManaTeluguMovies

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నుంచి రానున్న తదుపరి సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో తారక్ తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే తారక్ బర్త్ డే రానుంది, ఆ టైంకి ఆర్ఆర్ ఆర్ నుంచి తన బర్త్ డే టీజర్ వస్తుందా రాదా అనేది అనుమానంగా ఉన్న మాట వాస్తవమే..

కాసేపు ఆ విషయాన్ని పక్కన పెడితే.. పలు చోట్ల ఎన్.టి.ఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కేవలం పాన్ ఇండియా సినిమాలే చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని కొట్టిపారేశారు. ఎన్.టి.ఆర్ కి పాన్ ఇండియా సినిమా అనేది మొదటి ప్రాధాన్యత కాదు. కథే ప్రధమం.. కథని బట్టే నిర్ణయం తీసుకుంటారు. పాన్ ఇండియా కథ అయితే అలానే చేయడానికి, లేదా తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికే ఇష్టపడుతున్నాడని సమాచారం.

ఆర్ఆర్ఆర్ తరవాత సినిమా త్రివిక్రమ్ తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత సినిమా కోసం కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ లు లిస్ట్ లో ఉన్నారు. వారిలో ఎవరితో ఫిక్సయినా, కథని బట్టే అది ఏ స్థాయిలో చేయాలా అనేది ఫిక్స్ అవుతారట. చెప్పాలంటే అదే కరెక్ట్ ఛాయస్ కూడా మార్కెట్ వచ్చింది కదా అని పాన్ ఇండియా స్థాయిలో కథా బలం లేని సినిమాలు చేస్తే ఉన్న మార్కెట్ కూడా అపోయే అవకాశం ఉంది. అందుకే అభిమానులు కూడా ఈ విషయంలో హ్యాపీగా ఉన్నారు.


Advertisement

Recent Random Post:

Israel VS Iran: అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్‌… ఇరాన్‌పై క్షిపణులతో ప్రతీకార దాడి

Posted : April 20, 2024 at 12:45 pm IST by ManaTeluguMovies

Israel VS Iran: అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్‌… ఇరాన్‌పై క్షిపణులతో ప్రతీకార దాడి

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement