Advertisement

ఎన్టీఆర్‌ కోసం బుచ్చి బాబు ఎన్నాళ్లు వెయిట్‌ చేయాలి?

Posted : July 15, 2021 at 1:56 pm IST by ManaTeluguMovies

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ను ముగించే పనిలో ఉన్నాడు. ఆగస్టు వరకు జక్కన్న మూవీని పూర్తి చేయబోతున్న ఎన్టీఆర్‌ ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌ ఏర్పాట్లు మొదలు అయ్యాయి. ఇక కొరటాల శివ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్‌ లైనప్‌ పెద్దగానే ఉంది. ఇప్పటికే ప్రశాంత్‌ నీల్‌ మరియు అట్లీ కుమార్‌ ల దర్శకత్వంలో సినిమా లు చేయాల్సి ఉంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయనే నమ్మకం ఉంది.

ఈ మూడు సినిమాలు పూర్తి అయిన తర్వాత బుచ్చి బాబుతో ఎన్టీఆర్‌ సినిమా ఉంటుందనే టాక్ వస్తుంది. బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఎన్టీఆర్‌ నుండి ఆఫర్‌ వచ్చింది. అయితే ఎన్టీఆర్‌ తో సినిమా చేయాలంటే బుచ్చి బాబు కనీసం రెండేళ్లు అయినా వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటున్నారు. 2023 వరకు బుచ్చి బాబు వెయిట్‌ చేస్తాడా లేదంటే ఈ గ్యాప్‌ లో ఒక చిన్న సినిమాను చేస్తాడా అనేది చూడాలి. బుచ్చి బాబు తో సినిమాలకు యంగ్‌ హీరోలు చాలా ఇంట్రెస్ట్‌ తో ఉన్నారు.


Advertisement

Recent Random Post:

Congress Lok Sabha MPs Meet In a While

Posted : July 29, 2021 at 6:32 pm IST by ManaTeluguMovies

Congress Lok Sabha MPs Meet In a While

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement