ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఎన్టీఆర్‌కు అద్బుతమైన గిఫ్ట్‌ ఇచ్చిన ఫ్యాన్స్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు నందమూరి ఫ్యాన్స్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా అద్బుతమైన గిఫ్ట్‌ ఇచ్చారు. ట్విట్టర్‌లో తిరుగులేని రికార్డును ఎన్టీఆర్‌కు కట్టబెట్టి నందమూరి ఫ్యాన్స్‌ సత్తా చాటారు. నేడు ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్బంగా ఆయన అభిమానులు ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున హ్యాపీబర్త్‌డే ఎన్టీఆర్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేశారు. కేవలం 24 గంటల్లో రెండు కోట్లకు పైగా ట్వీట్స్‌ను ఫ్యాన్స్‌ హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్‌ హ్యాష్‌ ట్యాగ్‌ను పోస్ట్‌ చేశారు. ఈ ఏడాదిలో అత్యధిక హ్యాపీ బర్త్‌డే హ్యాష్‌ ట్యాగ్స్‌ రికార్డును ఎన్టీఆర్‌ దక్కించుకున్నాడు.

గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఏ హీరోకు హ్యాపీ బర్త్‌డే హ్యాష్‌ ట్యాగ్స్‌ నమోదు కాలేదు. గత ఏడాది పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌డే సందర్బంగా ఆయన అభిమానులు 24 గంటల్లో 10.51 మిలియన్‌ల హ్యాష్‌ ట్యాగ్స్‌తో ట్వీట్స్‌ చేశారు. ఆ తర్వాత స్థానంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అభిమానులు గత ఏడాది ఆయన బర్త్‌డే సందర్బంగా 8.3 మిలియన్‌ల హ్యాష్‌ ట్యాగ్స్‌తో ట్వీట్స్‌ చేశారు. ఆ తర్వాత స్థానంలో మళ్లీ పవన్‌ కళ్యాణ్‌ 2018 సంవత్సరంకు గాను నిలిచాడు.

హ్యాపీ బర్త్‌డే హ్యాష్‌ ట్యాగ్స్‌ విషయంలో 21.5 మిలియన్స్‌తో ఎన్టీఆర్‌ నెం.1 గా ఉండగా 10.51 మిలియన్స్‌తో పవన్‌ కళ్యాణ్‌ నెం.2గా ఉన్నాడు. ఇక సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నెం.3 స్థానంలో నెం.4 స్థానంలో మళ్లీ పవన్‌ కళ్యాణ్‌ ఉన్నాడు.

దేశ వ్యాప్తంగా కూడా చూసుకుంటే కూడా ఎన్టీఆర్‌ హ్యాపీ బర్త్‌ డే హ్యాష్‌ ట్యాగ్‌ నెం.1 స్థానంలో ఉంది. నెం.2 స్థానంలో పవన్‌ కళ్యాణ్‌ ఉండగా, నెం.3 స్థానంలో అజిత్‌ 8.43 మిలియన్‌లతో ఉన్నాడు. టాప్‌ 7లో అజిత్‌ 3వ స్థానంలో ఉండగా మిగిలిన ఆరు స్థానాలు కూడా తెలుగు హీరోలవే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.

తనపై అభిమానులు చూపుతున్న ఇంతటి ప్రేమకు ఎన్టీఆర్‌ ఫిదా అయ్యాడు. మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. My dear FANS, indebted to you for life అంటూ ట్వీట్‌ చేశాడు.

Exit mobile version