Advertisement

ఒరేయ్ బుజ్జిగా… ఓటిటి సినిమా థియేటర్ల వైపు

Posted : December 4, 2020 at 6:46 pm IST by ManaTeluguMovies

ఇక నుండి కొన్నాళ్ల పాటు ఇదే పద్దతి చూడబోతున్నామేమో. గతంలో సినిమాలు మొదట థియేటర్లలో విడుదలవ్వగా తర్వాత కొన్ని రోజులకు ఓటిటిలో విడుదలయ్యేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చాలా సినిమాలు మొదట ఓటిటిలో విడుదలయ్యాయి. అందులో ఒకటి ఒరేయ్ బుజ్జిగా.

రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదలైంది. అయితే ఈ చిత్రం విడుదలైనప్పుడు నెగటివ్ రివ్యూలనే తెచ్చుకుంది. రాజ్ తరుణ్ మరో ప్లాప్ ను అందుకున్నాడనే అందరూ భావించారు. గుండె జారి గల్లంతయ్యందే, ఒక లైలా కోసం సినిమాల దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విడుదలవుతోంది. ఈరోజు నుండి తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ లు రీఓపెన్ అవుతున్నాయి. ఇక చాలా చోట్ల డిసెంబర్ 11 నుండి సింగిల్ స్క్రీన్లు కూడా తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని జనవరి 1న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

మరి ఇప్పటికే ఓటిటిలో అవైలబుల్ గా ఉన్న ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుంది అన్నదే ఆసక్తికరం. ఒకవేళ ఈ ప్రయత్నం విజయవంతమైతే మరిన్ని ఓటిటి సినిమాలు ఈ రూట్ ను ఎంచుకోవడం ఖాయం.


Advertisement

Recent Random Post:

ఛాన్స్ వస్తే ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా

Posted : November 26, 2022 at 5:46 pm IST by ManaTeluguMovies

Watch ఛాన్స్ వస్తే ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement