రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదలైంది. అయితే ఈ చిత్రం విడుదలైనప్పుడు నెగటివ్ రివ్యూలనే తెచ్చుకుంది. రాజ్ తరుణ్ మరో ప్లాప్ ను అందుకున్నాడనే అందరూ భావించారు. గుండె జారి గల్లంతయ్యందే, ఒక లైలా కోసం సినిమాల దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విడుదలవుతోంది. ఈరోజు నుండి తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ లు రీఓపెన్ అవుతున్నాయి. ఇక చాలా చోట్ల డిసెంబర్ 11 నుండి సింగిల్ స్క్రీన్లు కూడా తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని జనవరి 1న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
మరి ఇప్పటికే ఓటిటిలో అవైలబుల్ గా ఉన్న ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుంది అన్నదే ఆసక్తికరం. ఒకవేళ ఈ ప్రయత్నం విజయవంతమైతే మరిన్ని ఓటిటి సినిమాలు ఈ రూట్ ను ఎంచుకోవడం ఖాయం.