జస్ట్ కాన్సెప్ట్ పోస్టర్ మాత్రమే రిలీజైన ఈ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. హరీష్ శంకర్ కూడా చాలా టైం తీసుకొని గబ్బర్ సింగ్ కి మించి హిట్ కొట్టేలా, కథని పగడ్బందీగా సిద్ధం చేస్తున్నారు. మాకు తెలిసిన ఎక్స్ క్లూజివ్ సమాచారం ప్రకారం, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమాలో కథానుగుణంగా కోల్ కతా బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నారు. అలాగే సినిమాలో చాలా భాగం షూటింగ్ కోల్ కతాలోనే చేయనున్నారు.
ఇవి మాత్రమే కాకూండా మరో న్యూస్ ఏంటంటే, ఈ సినిమా ప్రస్తుతంలో జరిగే కథ కాదట.. కొన్ని సంవత్సరాల క్రితం జరిగే ఓ పీరియాడిక్ ఫిల్మ్ గా పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ఫిల్మ్ ఉండనుందట. సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ 28వ సినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ పాత్రతో పాటు అదిరిపోయే మెసేజ్ తో పీరియాడిక్ ఫిల్మ్ గా రానుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.