ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి యూరప్ నుంచీ బాడ్ న్యూస్.!

మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం పింక్ సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నిన్న సాయంత్రం రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

ఈ చిత్ర బిజినెస్ విషయానికి వస్తే.. యుఎస్ లో 250కి పైగా స్క్రీన్స్ లో ప్రీమియర్స్ ప్లాం చేస్తున్నారు. ఇప్పటికే రీజనబుల్ రేట్స్ లో టికెట్స్ ని ఆన్లైన్ లో పెట్టడం కూడా మొదలు పెట్టారు. ఇలాంటి టైంలో వకీల్ సాబ్ కి యూరప్ ని ఓ చేదు వార్త వచ్చింది. అదేమిటంటే ప్రస్తుతం కోవిడ్ -19 సెకండ్ వేవ్ వలన యూరప్ లోని పలు కంట్రీస్ లో లాక్ డౌన్ మొదలైంది. దాంతో వకీల్ సాబ్ కి యుకె మార్కెట్ లో రిలీజ్ ఉండదట. కావున యుకె మార్కెట్ నుంచీ పెద్దగా కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు.

కోవిడ్ కారణంగా ఓవర్సీస్ మార్కెట్ ఇంకా పుంజుకోలేదు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాతో అది పుంజుకుంటుందని అటు ట్రేడ్ వర్గాలు, ఇట చిత్ర టీం భావిస్తోంది. కానీ యూరోప్ కంట్రీస్ లో ఇలా అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఆందోళనలో ఉన్నారు. శృతి హాసన్, అంజలి, నివేత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version