బండ్ల గణేష్ ఇటీవల పవన్ కళ్యాణ్ కోసం ఒక కథను రెడీ చేయించి వినిపించాడట. ఆ కథను రమేష్ వర్మ దర్శకత్వంలో చేసేందుకు పవన్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజతో ఖిలాడీ అనే సినిమాను చేస్తున్న రమేష్ వర్మ ఇండస్ట్రీలో దర్శకుడిగా కెరీర్ ఆరంభించి చాలా ఏళ్లు అవుతుంది. అయినా కూడా కమర్షియల్ గా బిగ్ సక్సెస్ ను దక్కించుకోలేదు. అయినా కూడా ఆయన చెప్పిన కథ నచ్చడంతో పవన్ నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కబోతుంది.