అజయ్ దేవగణ్ పాత్ర సినిమాలో కీలకం అవుతుందని చెప్పిన జక్కన్న, చూసిన వారందరికీ ఆయన పాత్ర గుర్తుండిపోతుందని చెప్పారు. మొన్నటి రాజీవ్ మసంద్ ఇంటర్యూలో అయితే.. అబ్బో ఆ పాత్రను అజయ్ మాత్రమే చేస్తే బాగుంటుందని 10లో తొమ్మిదిమంది చెప్పారంటూ రాజమౌళి కితాబిచ్చాడు. అయితే ఇక్కడే ఇంకో చర్చ మొదలైంది.
టాలీవుడ్ సినిమాకి బాలీవుడ్ మసాలా తగిలించడం కోసం అజయ్ దేవగణ్‌ను ఆ పాత్ర కోసం తీసుకున్నారు రాజమౌళి అండ్ కో. అయితే ఈ పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు లేదా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను తీసుకుని ఉంటే ‘ఆర్ఆర్ఆర్’ మరో రేంజ్‌కు చేరేదని అంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్.
మహేష్ బాబుకి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మంచి స్నేహం ఉంది. అలాగే అబ్బాయి చరణ్ అంటే, బాబాయి పవన్ కల్యాణ్‌కు ప్రాణం. ఎన్టీఆర్‌తోనూ పవన్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆల్ ఓవర్ ఇండియా క్రేజ్ ఉన్న స్టార్లు ఈ ఇద్దరూ. ఇలా ఎలా చూసినా అజయ్ దేవగణ్ పాత్ర కోసం పవన్ కల్యాణ్‌ను గానీ, మహేష్ బాబుని సంప్రదించి ఉంటే బాగుండేదని ఆశపడుతున్నారు.
అయితే ఇక్కడే ఇంకో చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఉన్న సినిమాలో మహేష్, పవన్ కల్యాణ్‌లలో ఎవరు నటించినా ఆ పాత్ర పరిధి చిన్నదైతే వారి ఫ్యాన్స్ ఊరుకోరు. అదీగాక కథానుగుణంగా అజయ్ దేవగణ్ పాత్ర ప్రాణాలు కోల్పోతే, ఫ్యాన్స్ ఏమీ అనుకోరు కానీ ఆ పాత్రలో తమ సూపర్ హీరో ఉంటే మాత్రం థియేటర్లను పడగొట్టేస్తారు. అందుకే అన్నీ ఆలోచించే రాజమౌళి సార్, బాలీవుడ్ దాకా వెళ్లి ఉంటారని ఫిల్మ్ నగర్ టాక్. వచ్చే ఏడాది జనవరి 8న ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యాక ఈ డిస్కర్షన్స్‌కు ఓ క్లారిటీ రావచ్చు.