ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పవన్‌ కళ్యాణ్‌ కు బండ్ల కొత్త పేరు

పవన్‌ కళ్యాణ్‌ ను ఆయన అభిమానులు దేవుడిగా ఆరాధిస్తారు. అంతగా అభిమానించే వారు పవన్‌ కు ఎంతో మంది ఉన్నారు. అయితే అందరిలోకి బండ్ల గణేష్‌ చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు. అభిమానులు పవన్ ను దేవుడిగా చూస్తారు. కాని బండ్ల గణేష్‌ మాత్రం తన సర్వం తనకు సర్వస్వం ఆయనే అన్నట్లుగా భావిస్తాడు. పవన్‌ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అని ప్రతి నిమిషం ఆయన అనుకుంటూ ఉంటారు. ఆయన ప్రతి అడుగులో కూడా పవన్‌ పై అభిమానం కనిపిస్తుంది. పవన్‌ కు రకరకాలుగా పేర్లను బండ్ల పెడుతూ ఉంటాడు.

బండ్ల గణేష్‌ కొత్తగా పవన్‌ కు ‘దేవర’ అనే పేరును పెట్టుకున్నాడట. పరమ శివుడును దేవర అని పిలుస్తూ ఉంటారు. అందుకే తాను పవన్‌ కళ్యాణ్ ను ఇకపై దేవర అని పిలుచుకుంటాను అంటూ బండ్ల గణేష్‌ చెప్పుకొచ్చాడు. ఈ రోజు నుండి నా బాస్ ని దేవర అని పిలుస్తాను అంటూ ట్వీట్‌ చేశాడు. పవన్‌ తో గబ్బర్ సింగ్‌ సమయంలో దిగిన ఫొటోను బండ్ల గణేష్‌ షేర్‌ చేశాడు. ఈ దేవర.. బాస్ అన్ని కూడా పవన్ తో మరో సినిమా కోసమేనా అంటూ కొందరు నెటిజన్స్‌ బండ్ల గణేష్‌ ను ఉడికిస్తున్నారు.

Exit mobile version