ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అదే బులుగు పైత్యం: జనసేనాని ప్రశ్నలకు బదులు చెప్పరేం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చి ప్రశ్నించాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ట్వీట్లేస్తే చాలు అధికార పార్టీ వెన్నులో వణుకు మొదలవుతుంది. రాష్ట్రం నుంచి పెద్దయెత్తున గంజాయి ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ అవుతున్న వైనంపై నిన్న వరుస ట్వీట్లేశారు జనసేన అధినేత. ఇంకేముంది.? అధికా పార్టీ తెగ గుస్సా అయిపోయింది.

అధికార వైసీపీకి బలమైన సోషల్ మీడియా కార్యకర్తలున్నారు.. వీళ్ళంతా ఏకధాటిన జనసేనానిపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడిపోయారు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ దగ్గర్నుంచి, చంద్రబాబుతో దోస్తీ, ప్యాకేజీ.. ఇలా ఏవేవో అర్థం పర్థం లేని వ్యవహారాల్ని తెరపైకి తెచ్చారు.

ఇక్కడ, గంజాయి కారణంగా రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందన్న విషయం పాపం బులుగు కార్మికులకు అర్థం కావడంలేదు. ‘జగన్ హయాంలో గంజాయి సాగు తగ్గింది.. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం.. కేంద్ర అధ్యయనాల ప్రకారం, మాదక ద్రవ్యాల వినియోగం రాష్ట్రంలో గతంతో పోల్చితే బాగా తగ్గింది..’ అంటోంది వైసీపీ ప్రభుత్వం. కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

ససాక్ష్యాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో నడుస్తున్న గంజాయి స్మగ్లింగ్ గురించి ట్వీట్లేశారు. వివిద రాష్ట్రాల్లోని పోలీసు అధికారులు, తాము పట్టుకున్న గంజాయి.. అదెక్కడి నుంచి వచ్చిందనే అంశాలు.. వీటన్నిటి గురించీ వివరిస్తున్న వైనాన్ని వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వుంచారు జనసేనాని.

ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ‘తూచ్.. అదంతా తప్పు..’ అనడానికి వీల్లేని పరిస్థితి. అందుకే, జనసేనానిపై దుష్ప్రచారం సోషల్ మీడియా వేదికగా చేయిస్తోంది వైసీపీ. రాష్ట్రంలో గంజాయి సాగవుతోందా.? లేదా.? రాష్ట్రం నుంచి గంజాయి పొరుగు రాష్ట్రాలకు స్మగ్లింగ్ అవుతోందా.? లేదా.? పొరుగు రాష్ట్రాల్లో దొరుకుతోన్న గంజాయి తాలూకు లింకులు ఏపీలో వున్నాయా.? లేదా.? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పేంత సీన్ వైసీపీలో ఎవరికీ లేదు మరి.

Exit mobile version