Advertisement

భీమ్లా నాయక్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్

Posted : November 2, 2021 at 8:26 pm IST by ManaTeluguMovies

పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను రేపు ఉదయం 11 గంటలకు ఇవ్వబోతున్నారు. బ్లాస్టింగ్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటలు.. గ్లిమ్స్.. పోస్టర్ లు వచ్చాయి. మరి రేపు రాబోతున్న అప్ డేట్ ఏమై ఉంటుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా లో పోలీస్ గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. కాని లుంగీ కట్టులో ఆయన బాడీ లాంగ్వేజ్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో రానా కీలక పాత్రలో నటించడంతో పాటు పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ను ముగింపు దశకు తీసుకు వచ్చారనే వార్తలు వస్తున్నాయి. రేపు షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఏమైనా చెప్తారేమో అంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ ను వాయిదా వేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ విషయాన్ని ఖండిస్తూ ఖచ్చితంగా సంక్రాంతికే భీమ్లా నాయక్ రాబోతున్నట్లుగా అధికారికంగా మళ్లీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా టీజర్ కు మరియు ట్రైలర్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. దీపావళికి అది ఏమైనా ఇస్తారా అంటే కావచ్చు అనే సమాధానం కూడా వినిపిస్తుంది. మొత్తానికి భీమ్లా నాయక్ రేపు ఉదయం 11 గంటల కు ఏం బాంబు పేల్చబోతున్నాడు.. దీపావళికి పవన్ అభిమానులకు ఇవ్వబోతున్న అప్ డేట్ ఏంటీ అనేది అందరిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ ఈ సినిమా కు రచన సహకారం అందిస్తూ ఉన్న విషయం తెల్సిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Pawan Kalyan : ఈనెల 30 నుంచి ప్రచారం ప్రారంభించనున్న పవన్

Posted : March 26, 2024 at 11:48 am IST by ManaTeluguMovies

Pawan Kalyan : ఈనెల 30 నుంచి ప్రచారం ప్రారంభించనున్న పవన్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement