ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

దత్త పుత్రుడు వర్సెస్ చంచల్ గూడా ఫోర్ ట్వంటీ.!

తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నాడట వెనకటికి ఒకడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుని నేరుగా ప్రస్తావించడానికి భయపడే కొందరు, ‘దత్త పుత్రుడు’ అంటూ వెటకారాలు చేస్తున్నారు. సరే, అదే నిజమని అనుకుందాం. ‘దత్త పుత్రుడు’ అంటే నిజానికి అదేమీ బూతు కాదు. కాకపోతే, వెటకారం. దత్త పుత్రుడు.. అని విమర్శించినోళ్ళ వెటకారానికి స్ట్రెయిట్‌గా జనసేన పార్టీ మద్దతుదారుల నుంచి అంతకు మించిన కౌంటర్ ఎటాక్ షురూ అవుతోంది.

‘పవన్ కళ్యాణ్ గారూ.. ఇకపై మిమ్మల్ని దత్త పుత్రుడని అంటున్నవారిని చంచల్ గూడా ఫోర్ ట్వంటీ అని పిలవండి..’ అంటూ సోషల్ మీడియా వేదికగా జనసేన మద్దతుదారులు కొందరు సూచిస్తున్నారు. నిజానికి, పవన్ కళ్యాణ్ అలా విమర్శించదలచుకుంటే అది ఆయనకు పెద్ద విషయమేమీ కాదు.

‘బోడి లింగం..’, ‘పూబంతి, చామంతి.. వెల్లుల్లి..’ అంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా సెటైర్లు వేసేశారు సందర్భానుసారం. పైగా, అభిమానుల నుంచీ.. జనసైనికుల నుంచీ ఆయా వ్యక్తులు చేస్తున్న విమర్శలపై స్పందించాలంటూ తన మీద ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ అలాంటి సెటైర్లు వేస్తుంటారు. పవన్ కళ్యాణ్ పనిగట్టుకుని ఎప్పుడూ సెటైర్లు వేసింది లేదు.

‘మీకు నచ్చిన భాషలోనే మీకు సమాధానమివ్వాలంటే, అదెంత పని.. కానీ, సంయమనం పాటిస్తున్నాం..’ అంటూ రాజకీయ ప్రత్యర్థులకు ప్రతిసారీ సంయమనంతో కూడిన సమాధానం చెబుతూనే, సున్నితమైన హెచ్చరికలు చేస్తున్నారు. కానీ, రాజకీయాల్లో ఇలా వుంటే సరిపోదు.

ఉన్నతమైన పదవుల్లో వున్నవాళ్ళూ సంస్కారం మర్చిపోతున్న దరిమిలా, ఓ రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్.. తమ కార్యకర్తల మనోభావాల్నీ గుర్తించాలి. కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నట్లుగా, ఇకపై జనసేనాని తననెవరైతే దత్తపుత్రుడని అంటున్నారో ఆయనగారి మీద ‘చంచల్ గూడా ఫోర్ ట్వంటీ..’ అంటూ సెటైర్లు షురూ చేస్తారా.? వేచి చూడాల్సిందే.

Exit mobile version