ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అటు రేణు.. ఇటు మెగా ఫ్యామిలీ.. మధ్యలో అకీరా

పవన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత మెగా ఫ్యామిలీకి, రేణు దేశాయ్‌కి మధ్య కొన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు పవన్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆమె పబ్లిక్‌గానే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు మరోసారి అకీరా పుట్టినరోజు కారణంగా ఈ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తారస్థాయికి చేరాయట.

పవన్ కల్యాణ్ కుమారుడైన అకీరా ప్రస్తుతం పూణెలో చదువుకుంటున్నాడు. 16 ఏళ్ల అకీరా నందన్‌ను కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంచాలని రేణు దేశాయ్ కోరిక. అయితే మెగా ఫ్యామిలీ మాత్రం అకీరాకు భారీ హైప్ ఇస్తోంది.

అకీరా పుట్టినరోజున మెగాస్టార్‌తో పాటు అభిమానులు భారీ సంఖ్యలో విషెస్ తెలిపారు. అందరికంటే హైట్ పెరిగిన అకీరా, అన్నింట్లోనూ అందనంత ఎత్తుకు ఎదగాలని చిరూ ట్వీట్ చేశారు. చరణ్ కూడా విషెస్ తెలిపాడు. ఇదే రేణు దేశాయ్‌కు అస్సలు నచ్చడం లేదట.

సినిమాలకు దూరంగా ఓ సాధారణ జీవితాన్ని అకీరాకు అందివ్వాలని రేణు దేశాయ్ భావిస్తుంటే… మెగా ఫ్యామిలీ మాత్రం అతన్ని వారసుడిగా పరిచయం చేయాలని చూస్తోంది. చిరంజీవి వారసుడు రామ్ చరణ్, నాగబాబు వారసుడు వరుణ్ తేజ్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడంతో పవన్ కల్యాణ్ వారసుడిగా అకీరా పవర్‌ఫుల్ ఎంట్రీ ఇస్తాడనే రేంజ్‌లో ప్రచారం జరుగుతోంది. పవన్ ఈ విషయమై ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోయినా అకీరాను హీరోగా చేయాలనేదే పవర్ స్టార్ అభీష్టంగా తెలుస్తోంది.

అటు తల్లి, ఇటు తండ్రి ఫ్యామిలీ… మరి అకీరా నందన్ ఎటువైపు వెళ్లడానికి మొగ్గుతాడో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.

Exit mobile version