జనసేన అధ్యక్షుడు శుక్రవారంనాడు తెలంగాణ లో పర్యటించి.. అనంతరం నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అనేక ఆసక్తికర అంశాలను జనసేనాని ప్రస్తావించారు.. పవన్ కళ్యాణ్ వెల్లడించిన విషయాలను.. ఆయన మాటల్లోనే నేరుగా ఇక్కడ అందిస్తున్నాము.
* దేశంలో ఎక్కడకి వెళ్లినా ఎపిలో దిగజారిన ఆర్ధిక పరిస్థితి పైనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే అప్పు పుట్టని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని చర్చించుకుంటున్నారు.
* ఢిల్లీ పెద్దల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. అందుకే శ్రీలంక తో ఎపిని పోలుస్తున్నారు. ఈ అంశాలను చూసే నేను ఇటీవల ట్వీట్ చేశాను.
* తెలంగాణ లో కూడా జనసేనకు మంచి ఆదరణ ఉంది. తెలంగాణలో 30 సీట్ల వరకు పోటీ చేయగలం. తెలంగాణలో 15 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.
* రాష్ట్ర ప్రభుత్వం విధానాలపై ప్రశ్నించే మార్పు ప్రజల్లో రావాలి.
* అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఎలా..? మైనింగ్ మాఫియా ఆగడాలు వాస్తవం కాదా..
* ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలో మాకు క్లారిటీ ఉంది. జనసేన, బిజెపి కలిసే జనాల్లోకి వెళతాం. పొత్తుల అంశంపై కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారు.
* ముందస్తు ఎన్నికల అంశం ఇప్పుడే చెప్పలేం.
* రాష్ట్ర విభజన వల్ల ఎ.పి.కి తీవ్ర అన్యాయం జరిగింది. హక్కుల గురించి, హామీల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. స్వప్రయోజనాలు ఆశించకుండా రాష్ట్రం కోసం మాట్లాడరా..!
* 151 సీట్లు ఇస్తే… రాష్ట్రంలో మంచి పాలన ఉందా..! ఏమి చేసినా చెల్లిపోతుంది అంటే ఎలా కుదురుతుంది..
* వైసిపి విధానాల వల్లే ఓటు చీలదని వ్యాఖ్యలు చేశాను. ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది..
* వ్యతిరేక ఓటు చీలకుండా కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ఉండాలి.
* నా విధానాలకు మద్దతు ఇవ్వడం అనేది బిజెపి ఇష్టం. నా అభిప్రాయాలు బిజెపి పెద్దలకు వివరిస్తా. రాష్ట్రం లో ఆర్ధిక పరిస్థితి, శాంతి భద్రతలు, అస్తవ్యస్త పాలన గురించి చెబుతా.శాంతి భద్రతల విఫలం, రాష్ట్రంలో ఏర్పడిన అధ్వాన్న పరిస్థితిని బిజెపి నేతలకు వివరిస్తా.
* నేను అన్ని మతాలను గౌరవిస్తా.. అరాధిస్తా. హిందూత్వ ఎజెండా దాటి బిజెపి చాలా చేస్తుంది కదా.
* జనసేన చేస్తున్న సాయాన్ని కూడా విమర్శలు చేస్తున్నారు..
* కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వరు?
* బిజెపి విధానాలు ఎలా ఉన్నా… నా నిర్ణయం పై సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నా. నేను మోడీగారితో బాగా కనెక్ట్ అవుతా.. నేను మాట్లాడే అంశాలు జాతీయ స్థాయిలో ఉంటాయి.
* రాష్ట్ర బిజెపి తో కలిసి పని చేస్తున్నా… ప్రణాళిక లోపం ఉంది. అందరం కూర్చుని మాట్లాడుకుంటే సెట్ అవుతుంది.
* బిజెపి కి జాతీయ స్థాయిలో మంచి బలం ఉంది. రాజధాని విషయంలో రైతులకు అండగా నిలిచారు. రాష్ట్రం లో ఉన్న అనేక అంశాలు, అధ్వాన పరిస్థితి కేంద్ర పెద్దలకు తెలుసు.
* రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై కేంద్రం జోక్యం చేసుకోదని అంటున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, ఇతర అంశాలపై కేంద్ర పెద్దలకు చెప్పా.
* బిజెపి, జనసేన సమావేశాలు లో కూడా వైసిపి వైఫల్యాలను చర్చించాం.
* విదేశీ సంస్థలు పెట్టుబడికి స్టెబిలిటి చూస్తారు. అది లేనప్పుడు ఎన్ని పర్యటన లు చేసినా ప్రయోజనం ఉండదు. పేపర్ల మీద సంతాకలు పెడితే పరిశ్రమ పెట్టినట్లు కాదు. వాస్తవ రూపంలో తీసుకువస్తే పరిశ్రమ లను స్వాగతిస్తాం.
* వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ ఒక్కటే తెలుగు వారందరినీ ఒక్కటి చేస్తుంది. స్టీల్ ఫ్లాంట్ అంశాన్ని ఇప్పటికే బిజెపి పెద్దలకి వివరించాను.
* ఎపి ప్రజల పట్ల కేంద్రానికి కూడా బాధ్యత ఉంది. నేను చెప్పిన అంశాలను బిజెపి విశ్వసిస్తుందని నమ్ముతున్నా.
* రాష్ట్రం బలంగా ఉంటే జనసేన బలంగా ఉంటుంది. జనసేన లో చేరేందుకు చాలా మంది ఆసక్తి గా ఉన్నారు.
* 2007 నుండి నేను రాజకీయాలలో ఉన్నాను. నేను అధికారంలో ఉన్నా లేకున్నా నా జీవితానికి ఇబ్బంది లేదు.
* ప్రజలు, ఉద్యోగులు, రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా నిర్ణయం తీసుకుంటా.
* ఎక్కడి నుంచి పవన్ పోటీ చేసినా ఓడిస్తామన్న వారి ఛాలెంజ్ ని స్వీకరిస్తా.
* ఇప్పటి వరకు ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయించ లేదు.
* పొత్తు అంశం పై నేను ఎటువంటి ఆలోచన చేయలేదు. ప్రస్తుతం బిజెపి తో మాత్రమే కలిసి నడుస్తాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓటు చీలకూడదని అనుకుంటున్నా.
* రాజకీయాలలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. ప్రజలకు సేవ చేయడం కన్నా.. నన్ను తిట్టడం పైనే కొంతమంది దృష్టి పెడుతున్నారు.
* తెలంగాణ లో రాజకీయంగా ఎన్ని కొట్టుకున్నా.. బయట మంచి సంబంధాలు కలిగి ఉంటారు.
* కౌలు రైతు భరోసా యాత్రలో వాళ్ల కష్టాలు చూసి చాలా బాధ కలిగించింది. ఎక్కడకి వెళ్లినా కౌలు రైతుల కన్నీళ్లు నన్ను కలచి వేశాయి. నా వంతు బాధ్యత అని భావించి సాయం అందిస్తున్నా.
* భూమి ఉన్న యజమాని కి ఇబ్బంది కలగకుండా కౌలు రైతులు కి గుర్తింపు కార్డు ఇవ్వాలి. భారతదేశం మొత్తం ఇది అమలు చేయాల్సిన అవసరం ఉంది.
* రాష్ట్రం లో ప్రజలకు ఉపయోగపడే అనేక పధకాలు నిలిపి వేశారు.
* సిపియస్ విధానం లో కూడా చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుంది. జనసేన అధికారంలోకి వస్తే సిపియస్ రద్దు చేస్తాం.
* ఒక మాట చెబితే.. అది శాసనంగా భావించాలి. వైసిపి నాయకులు మాత్రం చెప్పేదొకటి.. చేసేదొకటి.
* మాట తప్పిన రాజకీయ నాయకులను బాధ్యులను చేయాలి. నాతో సహా.. ఎవరు హామీ తప్పినా చర్యలు ఉండాలి.. సిపియస్ పై హామీ ఇచ్చి.. టెక్నికల్ గా కాదని ఎలా చెబుతారు?
* మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చి ఎలా అమ్ముతున్నారు?
* లక్ష కోట్లు విదేశాలకు తరలించే తెలివి తేటలు ఉన్నాయి. జనాలకు మేలు చేసే అంశాలపై శ్రద్ద పెట్టరా..?
* ప్రజలు .. అవినీతి, అక్రమాలను ప్రశ్నించలేక పోతున్నారు. ఎవరికి వారు ఆలోచించుకుని నిలదీసే పరిస్థితి ఆలోచించాలి.
* రాష్ట్ర విభజన దగ్గర నుంచీ రాజకీయ నాయకులు వ్యక్తిగత స్వలాభం కోసం పని చేస్తున్నారు. సీనియర్ నాయకులు, మేధావులు అందరూ కూర్చుని రాష్ట్రంలో పరిస్థితి చర్చించాలి.
వైసిపికి ఓటు వేయడం ఎంత వరకు కరెక్టో ఆలోచించాలి.
* వైసిపి వ్యతిరేక ఓటు చీలదని ఐదు పదాల వ్యాఖ్య చేశాను. దానికి వైసిపి వాళ్లు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఏమి లేదనుకుంటే … నా వ్యాఖ్యలు వదిలేయ వచ్చు కదా..?
*ఎపి కి ఇచ్చే అప్పులు అన్ని విధాలా పరిమితులు దాటి పోయాయి. డబ్బులు ఇస్తున్నట్లు వైసిపి వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఆర్ధికపరమైన అంశాలలో బ్యూరో క్రాట్స్ నలిగిపోతున్నారు. అధికారులకు వాయిస్ లేదు, ఛాయిస్ లేదు.
* సినిమా టిక్కెట్ల అంశాన్ని ప్రజలు పెద్ద సీరియస్ గా పట్టించుకోవడం లేదు.
* కోడి కత్తి విషయంలో నడిచిన డ్రామా అందరిని ఆశ్చర్యపరిచింది.
* వివేకా హత్య విషయాన్ని ఎన్నో మలుపులు తిప్పారు. మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు దోషులను శిక్షించ లేదు.
* లా అండ్ ఆర్టర్ బలంగా లేకపోతే క్రిమినల్స్ రెచ్చిపోతారు. కోడి కత్తి, వివేకా హత్య కేసులలో బాధ్యత తీసుకోవాలి. క్రిమినల్ ను పట్టుకోకపోతే మీరే చేసుకున్నారని ప్రజలు నిర్ధారణకు వస్తారు.
* ప్రజలకు దగ్గరయ్యే విధంగా నా యాత్ర చేపడతా..
ఈ సమావేశంలో పదనిసలు.
* పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో జనసేన పార్టీ కార్యాలయం లో పవర్ కట్
* సమావేశం సమాచారం రావడంతో కరెంటు తీయించారంటూ పవన్ ఛలోక్తులు..
* ఇటువంటి ఘటనలు ఎన్నో చోట్ల అమలు చేస్తారు, కాసేపు చీకటిలోనే చర్చ ను కొనసాగిద్దామంటూ సరదాగా వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్.
* జనరేటర్ ఆన్ చేసి మీటింగ్ ను కొసాగించిన జనసేన నేతలు.