ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పవర్ స్టార్ ను కలిసిన కన్నడ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ముందుగా బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ ను వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఆ తర్వాత పవన్ చేతిలో వరస కమిట్మెంట్స్ ఉన్నాయి. హరీష్ శంకర్, క్రిష్, సురేందర్ రెడ్డి లతో వరుసగా సినిమాలు చేయాల్సి ఉంది పవన్ కళ్యాణ్.

వకీల్ సాబ్ షూట్ రీసెంట్ గా తిరిగి మొదలుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా వకీల్ సాబ్ షూట్ లో పాల్గొనట్లేదు. వచ్చే నెల నుండి షూట్ లో పాల్గొనే అవకాశముంది. ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లోనే పవన్ కళ్యాణ్ తన సమయాన్ని గడుపుతున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ ను కన్నడ స్టార్ నటుడు సుదీప్ కలిసాడు. ఇది మర్యాదపూర్వక భేటీ అని తెలుస్తోంది.

ఈ సందర్భంగా సుదీప్ కు పవన్ కళ్యాణ్ పూల కుండీ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. దాదాపు గంట సేపు ఇద్దరూ కలిసి చర్చించుకున్నారు. సుదీప్ తను చేసే సినిమాల గురించి పవన్ కళ్యాణ్ కు వివరించినట్లు తెలుస్తోంది.

Exit mobile version