ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పవన్‌ సంతాపం తెలిపితే.. ఇంతటి నిస్సిగ్గు రాజకీయమా.?

ఓ వ్యక్తి చనిపోతే, శతృవైనాసరే.. ‘అయ్యోపాపం’ అనడం మానవత్వం. పైగా, తన పట్ల అభిమానంతో తనను పిలిచి సత్కరించిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని తెలిసి సానుభూతి తెలిపితే, దాన్ని నేరంగా పరిగణిస్తారా.? జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ఇటీవల రాజధాని అమరావతి పరిధిలో ఓ రైతు నాయకుడు చనిపోతే సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. అది ఆయనగారి కూతురికి నచ్చలేదట. కన్న తండ్రి ఇకలేరన్న బాధలో వుండాల్సిన ఆ ‘కూతురు’, ఎవరు తన తండ్రి మృతికి సంతాపం తెలిపితే, వారి మీద విరుచుకుపడాలనే ఓ ‘మిషన్‌’ మీద బిజీగా వున్నట్లుంది.

ఓ మహిళ మాట్లాడాల్సిన మాటలు కావు.. ఆమె సోషల్‌ మీడియాలో పెట్టిన కామెంట్లు. ‘నా తండ్రి మరణాన్ని రాజకీయం చేయాలని చూస్తారా.?’ అంటూ ఓ స్థాయిలో ‘శవ రాజకీయం’ చేసేసింది. దీన్ని వైసీపీ అనుకూల మీడియా సంస్థలు హైలైట్‌ చేస్తూ, పవన్‌ కళ్యాణ్‌కి సుద్దులు చెబుతున్నాయి.

గతంలో ఓసారి తనకు ఆ రైతు నాయకుడితో ఏర్పడిన పరిచయం నేపథ్యంలో ఆ రైతు నాయకుడి మృతి పట్ల సంతాపం తెలిపారు పవన్‌ కళ్యాణ్‌. ఆ రైతు నాయకుడి సేవల్ని కొనియాడారు. ఇందులో తప్పేముంది.? ఇందులో రాజకీయం ఏం కనిపించింది.? నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన కాకపోతే, ఆ రైతు నాయకుడి కుమార్తె ‘వైసీపీ’ ముసుగులో ఇంత నిస్సిగ్గు రాజకీయం చేయగలదా.?

సరే, ఆమె సంగతి పక్కన పెట్టేద్దాం. తండ్రి పోయిన ఆవేదనలో ఆమె వుందని అనుకుందాం. పచ్చ మీడియాకి ఏం పిచ్చి పట్టింది.? బ్లూ మీడియాకి ఏ పైత్యం పట్టుకుంది.? కనీసపాటి విజ్ఞత, సంస్కారం లేకుండా.. పవన్‌ కళ్యాణ్‌ మీద జుగుప్సాకరమైన రాతలు, ఆ రైతు నాయకుడి కుమార్తె వ్యాఖ్యల్ని అడ్డంపెట్టుకుని రాయడం ఏ నైతిక విలువలకు నిదర్శనం.?

విలువలకు ఎప్పుడో వలువలూడ్చేశాయి ఎల్లో మీడియా, బ్లూ మీడియా. ఇలాంటి మీడియా సంస్థల నుంచి సంస్కారం ఆశిస్తే అంతకన్నా దారుణం ఇంకోటుండదు. ఒక్కటి మాత్రం నిజం.. ఆ రైతు నాయకుడి ఆత్మ ఇవన్నీ చూస్తోంటే మాత్రం, ఉరేసుకుని చచ్చిపోవాలి కూతురి వెకిలి చేష్టలు, బ్లూ అండ్‌ ఎల్లో మీడియా పిచ్చి రాతలకి.

Exit mobile version