సినీ పరిశ్రమలోనే కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలపై లైంగిక వేధిపులు జరిగాయి అనే వాదనలు ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాము. కానీ సినీ పరిశ్రమలో ఎక్కువగా ఇలాంటి వార్తలు బయటకి వస్తుంటాయనేది వాస్తవం. ఇటీవలే మీటూ ఉద్యమం గట్టిగానే జరిగింది. ఆ తర్వాత కాస్త తగ్గింది. తాజాగా ‘ప్రయాణం’, ‘ఊసరవెళ్లి’ సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనురాగ్ కశ్యప్ నన్ను లైంగికంగా వేధించాడంటూ పోస్ట్ చేయడంతో ఈ టాపిక్ మళ్ళీ వేడెక్కింది.. ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎవరి కామెంట్స్ ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే..
కంప్లైంట్ రైజ్ చేసిన పాయల్ కామెంట్స్ – ‘అవకాశం కోసం వెళ్లిన నాతో అనురాగ్ చాలా తప్పుగా ప్రవర్తించాడు. ఇండస్ట్రీలో పని చేయాలని వస్తే అన్నింటికీ సిద్ధపడి వచ్చినట్టు కాదు. నాకు జరిగిన ఘటన 2014–15 ప్రాంతంలో జరిగింది. నాకు అమితాబ్ బచ్చన్‌తో పరిచయం ఉంది.. నాతో పని చేసే హీరోయిన్లు నాతో క్లోజ్‌గా ఉంటారు. నువ్వు అలానే ఉండాలని అన్నారు. అనురాగ్ మీద చర్యలు తీసుకోవాలి’ అని పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది.
దీనికి సపోర్ట్ గా నిలుస్తూ లేడీ టైగర్ కంగనా రనౌత్ ‘పాయల్ ఘోష్ తో అనురాగ్ ఎలా ప్రవర్తించాడో అదే విధానం బాలీవుడ్‌లో ఎప్పటి నుండో జరుగుతోంది. అనురాగ్‌ను అరెస్ట్ చేయాలి. అవకాశాల కోసం వచ్చే అవుట్ సైడర్స్ ను సెక్స్ వర్కర్స్ లా చూడటం ఇక్కడ ఇక్కడ వారికున్న అలవాటు’ అంటూ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు.
హీరోయిన్ తాప్సీ మాత్రం తన డైరెక్టర్ కి సపోర్ట్ గా ‘నాకు తెలిసిన అతిపెద్ద స్త్రీ వాదివి నువ్వే. మనిద్దరం కలిసి మరో గొప్ప ఆర్ట్ సృష్టించడానికి కలసి పని చేయాలి’ అందుతూ అనురాగ్ కి సపోర్ట్ గా ట్వీట్ చేశారు. అలాగే ఎడిటర్ మరియు అనురాగ్ కశ్యప్ భార్య ఆర్తీ బజాజ్ ‘ఒకరి మీద ద్వేషం క్రియేట్ చేయడానికి పెట్టె ఎఫర్ట్స్ ని ప్రేమించడానికి పెడితే ఈ ప్రపంచం చాలా బావుంటుంది. నిలదీసి మాట్లాడేవాళ్లందర్నీ అణచివేయాలనుకుంటున్నారా? అనురాగ్… నీ సినిమాల్లో పనిచేసే వారు సురక్షితంగా ఉంటారనే విషయం నాకు తెలుసని’ పోస్ట్ పెట్టి తన సపోర్ట్ ని తెలియజేశారు. అలాగే అనురాగ్ తో కలిసిపని చేసిన పలువురు ఆయనకు మద్దతుగా నిలిచారు.
ఫైనల్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాగ్ కశ్యప్ ఈ విషయం పై రియాక్ట్ అయ్యాడు. ‘నా మీద వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు, అవన్నీ అవాస్తవాలలే.. కావాలంటే నా జీవితంలో నేను ప్రేమించిన, పెళ్లి చేసుకున్న, నాతో కలిసి పని చేసిన ఏ నటినైనా, ఫీమేల్ టెక్నీషియన్ అని అయినా ఓపెన్ గా అడిగితే నేనేంటో చెబుతారు. వీళ్ళే కాదు, నేను పలు రకాల పనుల మీద కలిసే ఏ అమ్మాయిని అడిగినా నా గురించి చెబుతారు. నా మీద వస్తున్న ఆరోపణల విధంగా నేనెప్పుడూ ప్రవర్తించలేదు. అలా చేసేవాళ్ళని కూడా నేను ప్రోత్సహించను. కేవలం నా నోరు మూయించడానికే ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారని’ అనురాగ్ అన్నారు.
మరి ఇప్పుడు ఈ విషయంపై పాయల్ ఘోష్ స్పందిస్తుందా? లేక ఏమీ తెలియదన్నట్టు సైలెంట్ అయిపోతుందా అనేది చూడాలి..
@anuragkashyap72 has forced himself on me and extremely badly. @PMOIndia @narendramodi ji, kindly take action and let the country see the demon behind this creative guy. I am aware that it can harm me and my security is at risk. Pls help! https://t.co/1q6BYsZpyx
— Paayel Ghoshॐ #modi’s family ..modiji my Father 😇 (@iampayalghosh) September 19, 2020
Thank you so much for your support @KanganaTeam. This was high time and your support means a lot. We are women and we can together bring all of them down. https://t.co/1NlWH0qngp
— Paayel Ghoshॐ #modi’s family ..modiji my Father 😇 (@iampayalghosh) September 20, 2020
For you, my friend , are the biggest feminist I know.
See you on the sets soon of yet another piece of art that shows how powerful and significant women are in the world you create 🙂 🤗 https://t.co/M9AgMDHTPH— taapsee pannu (@taapsee) September 20, 2020
And here is the statement from my lawyer @PriyankaKhimani .. on my behalf .. thank You pic.twitter.com/0eXwNnK5ZI
— Anurag Kashyap (@anuragkashyap72) September 20, 2020