‘నేను లేనప్పుడు ఎవడైనా రావొచ్చేమో.. నేను వున్నప్పుడు వచ్చే మగతనం ఎవడికైనా వుందా.?’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆ తర్వాత చెలరేగిపోయారనుకోండి.. అది వేరే సంగతి. అన్నట్టు, జేసీ ఇంట్లోకి చొరబడ్డ కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ అనుచరుడిగా చెప్పబడుతున్న వ్యక్తిపై దాడి చేసినట్లు కథనాలొచ్చాయి. ‘అబ్బే, నేను శాంతిని నెలకొల్పడానికే వెళ్ళాను.. ఎమ్మెల్యేగా నాకున్న బాధ్యత మేరకు.. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల్ని కాపాడేందుకోసం..’ అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి కొత్త కథ వినిపించారు.
జేసీ అండ్ టీమ్ అనంతపురం జిల్లాలో నడిపిన ‘చరిత్ర’ ఏంటి.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ ఎపిసోడ్‌లో మాత్రం జేసీ టీమ్ బాధిత కేటగిరీలో వుంది. కానీ, చిత్రంగా.. ఆ టీమ్ మీదనే పోలీసులు ‘అట్రాసిటీ’ కేసులు పెట్టారు. ఇక, వివాదం ముదిరి పాకాన పడినా.. పోలీసుల తీరు మారలేదన్న విమర్శలున్నాయి. అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాయడం అనేది రాయలసీమలో సర్వసాధారణమే. ఇక్కడా అదే జరిగింది.
అయితే, జేసీ టీమ్, తమ మీద జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, అందుకు సంబంధించిన ఆధారాల్ని సమర్పించేసరికి.. పోలీసులు విధిలేక, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపైనా, ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. అయితే, ఇక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. సదరు న్యాయవాది.. తనకూ ఈ కేసుకీ ఎలాంటి సంబంధం లేదని వాపోతున్నారట. ఇదీ రాయలసీమ రక్త చరిత్ర. ఎంతలా బెదిరింపులు అక్కడ లేకపోతే.. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఆ తర్వాత తనకేం సంబంధం లేదని చెబుతారు.? అసలు రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలవుతోంది.?