ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రెడ్డిగారి ‘పవర్‌’ పంచ్‌.! అయ్యయ్యో ఉప ముఖ్యమంత్రి.!

వైసీపీ హయాంలో ‘రెడ్డి’ సామాజిక వర్గానికి వున్న ప్రాధాన్యత.. ఇతర సామాజిక వర్గాల పట్ల వున్న చిత్తశుద్ధి ఏంటన్నదానిపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. దళితుడైన ఓ డిప్యూటీ సీఎంని పట్టుకుని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రి ‘బుద్ధీ జ్ఞానం లేదా.?’ అంటూ అందరి ముందూ నిలదీయడాన్ని ఏమనాలి.? ఆ ఇద్దరూ చిత్తూరు జిల్లాకి చెందిన వైసీపీ ముఖ్య నేతలే. ఒకరు ఉప ముఖ్యమంత్రి పతివాడ నారాయణస్వామి కాగా, మరొకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ఉప ముఖ్యమంత్రి అంటే, ముఖ్యమంత్రి తర్వాతి స్థానం. ఆ తర్వాతే మంత్రి. కానీ, ఇక్కడ సీన్‌ రివర్స్‌. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ‘పవర్‌’ చూపించారు. పవర్‌ అంటే, ఇక్కడ ‘పొగరు’ అనుకోవాలేమో. దీన్ని ‘రెడ్డి’ అహంకారం.. అని నెటిజన్లు విమర్శిస్తున్నారనుకోండి.. అది వేరే విషయం.

‘మేం దళితులకు ఎక్కువ అవకాశాలిచ్చాం.. ఉప ముఖ్యమంత్రుల్ని చేశాం..’ అని వైసీపీ చెప్పుకుంటోంది. నిజమే.. అలా ఉప ముఖ్యమంత్రుల్ని చేసింది ఎందుకు.? ఇలా అవమానించేందుకేనా.. అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పతివాడ నారాయణస్వామి మధ్య జరిగిన వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు సోషల్‌ మీడియాలో చాలామంది.

ఓ ప్రెస్‌మీట్‌ సందర్భంగా జరిగింది ఈ గలాటా. ఉప ముఖ్యమంత్రి మీద మంత్రిగారికి ఎందుకు కోపం వచ్చిందో ఏమో.! నిజానికి, చిత్తూరు జిల్లాలో పాపం ఉప ముఖ్యమంత్రికి కొందరు ఎమ్మెల్యేలు కూడా తగిన గౌరవం ఇవ్వని పరిస్థితి. పైకి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారట ఆయనగారు. ‘అబ్బే అదేమీ లేదు.. ఇదంతా గిట్టనివారు చేస్తోన్న దుష్ప్రచారం..’ అని వైసీపీ కొట్టి పారేయొచ్చుగాక. కానీ, ఇప్పుడు జరిగిందేంటి.?

ప్రెస్‌మీట్‌ సందర్భంగా.. అందరూ చూస్తుండగానే, ‘బుద్ధీ జ్ఞానం లేదా.?’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై విరుచుకుపడటమంటే.. వైసీపీలో దళిత నేతలకు రెడ్డి నేతల నుంచి దక్కుతున్న గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో ఓ దళిత రైతు, ఇంకో దళితుడ్ని ప్రశ్నిస్తే.. ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపించేసి.. ‘ఇదీ మా చిత్తశుద్ధి.. దళితులపై ఇదీ మాకున్న గౌరవం..’ అని చెప్పుకుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

కోర్టు ఆ తర్వాత చీవాట్లు పెట్టిందనుకోండి ఆ అరెస్టుల వ్యవహారంపై.. అది వేరే సంగతి. ఇప్పుడు ఇక్కడ ఓ దళిత ఉప ముఖ్యమంత్రికి, ఓ రెడ్డి మంత్రి కారణంగా అవమానం జరిగింది.. మరి, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా రెడ్డి మంత్రిపైన?

Exit mobile version