ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఫోటోటాక్ : పూల్ లో విందు ఆరగిస్తూ అందాల విందు


తెలుగు లో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా తో 2010 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్. అదే సంవత్సరంలో బావ సినిమాలో కూడా నటించి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. తెలుగు లో పలు సినిమాల్లో నటించినా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్.. గుర్తింపు రాలేదు. పవన్ కళ్యాన్ అత్తారింటికి దారేది సినిమా తో పాటు ఎన్టీఆర్ సినిమాలో నటించినా కూడా స్టార్ డమ్ దక్కలేదు.

టాలీవుడ్ లో అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే కన్నడ సినిమా పరిశ్రమపై ఈ అమ్మడు దృష్టి పెట్టింది. అక్కడ ఈమె చేసిన పలు సినిమాలు అక్కడి ప్రేక్షకులకు మరియు ఇండస్ట్రీ వారిని నచ్చాయి. అక్కడ ఒక స్థాయి స్టార్ డం దక్కించుకుని పలు సినిమాలను చేసింది.

కెరీర్ లో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఇటీవల బేబీ కి జన్మనిచ్చిన ప్రణీత మళ్లీ తన మునుపటి లుక్ కి మారింది. బాపు బొమ్మ అన్నట్లుగా ఉండి అందరినీ ఆకట్టుకున్న ప్రణీత మళ్లీ అదే తరహా లుక్ లోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ మా బాపు బొమ్మ ఇంత అందంగా అవ్వడం పట్ల ఆనందంగా ఉందంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా స్విమ్మింగ్ పూల్ లో వింధు భోజనంను ఆస్వాదిస్తూ తన అందాల విందును సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ కు పెట్టింది అన్నట్లుగా ఈ ఫోటోలను షేర్ చేసింది. అందమైన ఈ ఫోటోల్లో అందాల ప్రణీత బికినీ షో తో మతి పోగొట్టింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ముద్దుగుమ్మ అందం ఏమాత్రం తగ్గలేదు అనేది నెటిజన్స్ కామెంట్స్.

Exit mobile version