ఈ సినిమా ప్రచారం పనుల్లో పూజాహెగ్డే ఎంత యాక్టివ్ గా హాజరైందో చెప్పాల్సిన పనిలేదు. ఒకనాక దశలో అమ్మడి స్పీడ్ చూసి ప్రచార బాధ్యతలు మొత్తం తానే తీసుకున్నంత సీరియస్ నెస్ చూపించింది. అటు పై రిలీజ్ తర్వాత ‘బీస్ట్’ నిర్వహించిన కొన్ని ఈవెంట్లకు సైతం చెన్నై వెళ్లి హాజరైంది. ఆ రకంగా విజయ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది.
ఆ రెండు సినిమాల ఫలితాల గురించి పక్కనబెడితే! పూజాబ్యూటీ ప్రస్తుతం రిలాక్స్ అవుతంది. అలసిసొలసిన అందం ముంబైలో ఇంటిపట్టునే ఉంటుంది. కుటుంబ సభ్యులతోనే సమయాన్ని గడుపుతుంది. అయితే మరికొద్ది రోజుల్లో ఓ హిందీ సినిమా షూట్ లో పాల్గొనాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చే నెలలో ఓ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇందులో భాయ్ కి జోడీగా పూజా నటిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేయాలి. కానీ కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడింది. ఇప్పుడు పోర్త్ వేవ్ దూసుకొస్తున్న సమయంలో షూట్ కి రెడీ అయ్యారు. ఈ సినిమాకి సల్మాన్ 90 రోజుల పాటు డేట్లు ఇచ్చారు. పూజా కూడా ఎక్కువ రోజులే డేట్లు కేటాయించినట్లు సమాచారం.
దీంతో ఈ లోపు సినిమా పూర్తిచేయాలి. ఈ నేపథ్యంలో స్టార్ మేకర్ వచ్చే నెల నుంచి షూట్ కి సర్వం సిద్దం చేస్తున్నారు. అయితే ఇక్కడ పూజాకి కలిసొచ్చే అంశం ఏంటంటే? తెలుగులో రెండు..మూడు సినిమాలున్నాయి. కానీ అవి ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేదు. ఈ గ్యాప్ లో సల్మాన్ షూట్ ని సోకూల్ గా పూర్తి చేయవచ్చు.
ఆ ఇద్దరి హీరోల గురించి ఆలోచించాల్సిన పనిలేదు. సూపర్ స్టార మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో పూజా హెగ్డే నే లాక్ అయింది. అలాగే ‘భవదీయుడు భగత్ సింగ్’ లోనూ ఆమె హీరోయిన్ అని వినిపిస్తుంది.