ఇదే క్రమంలో పూజా ని మెయిన్ హీరోయిన్ గా తీసుకోవడం లేదని.. కేవలం ఒక స్పెషల్ సాంగ్ కోసమే ఫైనల్ చేయబడిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.ఈ నేపథ్యంలో పూజా హెగ్డే పీఆర్ టీమ్ ఈ రూమర్స్ పై స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.
‘జనగణమన’ సినిమాలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేయడం లేదని.. ఆమె కథానాయికగా మాత్రమే నటిస్తుందని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రూమర్స్ కు చెక్ పడినట్లయింది.
ఇకపోతే జూన్ రెండో వారం నుంచి పూజా హెగ్డే ‘జనగణమన’ సెట్స్ లో జాయిన్ అవుతుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ – పూజాలపై పూరీ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని టాక్.
JGM అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పూరీ పేర్కొన్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. పూరి కనెక్ట్ మరియు శ్రీకర స్డూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఛార్మి కౌర్ – వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
షూటింగ్ ప్రారంభం రోజే ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2023 ఆగస్టు 3న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. మరి త్వరలోనే హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఫైనలైజ్ చేసినట్లు అనౌన్స్ చేస్తారేమో చూడాలి.
ఇకపోతే ఈ ఏడాది ఇప్పటి వరకు పూజా బ్యాక్ టూ బ్యాక్ హ్యట్రిక్ ప్లాప్స్ అందుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘రాధే శ్యామ్’ – ‘బీస్ట్’ వంటి పాన్ ఇండియా సినిమాలు ఘోర పరాజయం చవిచూసాయి. ‘ఆచార్య’ సినిమా డిజాస్టర్ అయింది. ‘ఎఫ్ 3’ లో చేసిన స్పెషల్ సాంగ్ కి మంచి స్పందన వచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కనున్న SSMB28 మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. అలానే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ల ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో నటించనుంది. హిందీలో ‘సర్కస్’ మరియు ‘కభీ ఈద్ కభీ దివాలి’సినిమాలు చేస్తోంది.