పూనమ్ పాండే….నటనతో కంటే వివాదాలతోనే పాపులర్ అయిన బాలీవుడ్ నటి, మోడల్. 2011లో టీమిండియా వన్డే క్రికెట్ ప్రపంచ్ కప్ గెలిస్తే నగ్నంగా నిలబడతానని ప్రకటించి యావత్ దేశ దృష్టిని తన వైపు కున్నారామె. ఆ విధంగా ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, ఆ తర్వాత చాలా వివాదాలతో ఆమె వార్తల్లో నిలిచే నటిగా పేరు పొందారు. ప్రముఖనటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై బాంబే హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
పూనమ్ గురించి పరిచయ వాక్యాలు రాయాల్సి వస్తే వివాదాలే డ్యామినేట్ చేస్తాయి. నషా, ఆగయా హీరో, ద జర్నీ ఆఫ్ కర్మ తదితర సినిమాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం లాక్డౌన్ వేళలో మరోసారి ఆమె పేరు తెరపైకి వచ్చింది.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి ఆదివారం రాత్రి 8.05 గంటల సమయంలో బిఎమ్‌డబ్ల్యూ కారులో తిరుగుతున్నట్టు గుర్తించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు పూనమ్‌తో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూనమ్ స్నేహితుడు చిత్ర దర్శకుడు సామ్ అహ్మద్ బాంబే(46)గా గుర్తించారు. కొంతకాలంగా పూనమ్, సామ్ అహ్మద్ డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ టాక్.
మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో వీద్దరిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 188, 269, జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వీళ్లు ప్రయాణిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీళ్లద్దరినీ అరెస్ట్ చేసి, అనంతరం విడిచిపెట్టారు.