స్వేచ్ఛ అని హక్కుని – నానా విధాలుగా హింసింది, ఎవ్వరూ వాడుకోనంతగా వాడేసుకోవడం ఎవరి జీవితాల్లో అయినా తొంగి చూడడం బెడ్ రూమ్ గోడల్ని బద్దలు కొట్టుకుని మరీ దూసుకెళ్లిపోవడ వర్మ నైజం.
ట్విట్టర్ ఉంది కదా.. అని ఏది పడితే అది వాగేసి, ఎంత పడితే అంత, ఎవరిపై పడితే వాళ్లకే కక్కేసే కక్కుర్తి బుద్ధి కేవలం వర్మకే ఉందన్నది ఆయన అభిమానులు అనబడే భక్తులు కూడా చెప్పుకునే విషయం.
ఆత్మ కథలు, ఆత్మల కథలు తీసి, సొమ్ము చేసుకోవాలనుకోవడం వర్మ వ్యాపార సూత్రం. అలాంటి వర్మ మరోసారి – తన చావు తెలివి తేటలు ఉపయోగిస్తూ `పవర్ స్టార్` సినిమా తీస్తున్నాడు.
ఇది పవన్ కల్యాణ్ సినిమా కాదు… అని చెబుతున్నా – పవర్ స్టార్ అంటే ఎవరో, ఆ పేరు ఎవరి పేరు ముందు గర్వంగా నిలబడుతుందో – తెలుగు ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులతకు తెలియంది కాదు.
పవన్ అభిమానుల్లో, పవన్ ఇమేజ్‌నో, పవన్ పేరునో వాడుకోకపోతే.. పూట గడవని వర్మ – ఇప్పుడు ఏకంగా పవన్ పై సినిమా తీసే సాహసం చేస్తున్నాడు. ఎప్పటిలా జూనియర్ ఆర్టిస్టులకు తక్కువ – డూప్‌లకు ఎక్కువ అనిపించే ఆర్టిస్టుల్ని వెదకి పట్టి – కేవలం పబ్లిసిటీతో జిమ్మిక్కుల చేసి, టికెట్లు అమ్ముకోవడానికి వెంపర్లాడిపోతున్నాడు.
విచిత్రం.. ఏమిటంటే.. అందరినీ వర్మ కెలకడం తప్ప – వర్మ జోలికి పోవడానికి ఎవరూ సాహసం చేయరు. కానీ.. అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా..? వర్మని కాలర్ పట్టుకుని, నెత్తిమీద రెండు మొట్టికాయలు వేసే వాడు ఎవడో ఒకడు, ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు. ఈసారి వచ్చేశాడు కూడా. అందరిపై సినిమాలు తీసే వర్మపై ఓ సినిమా తీస్తున్నారిప్పుడు. పేరేంటో తెలుసా? `పరాన్న జీవి`.
ఎప్పుడూ పక్కోడిపై పడిపోయి, బతికేసే ఆర్జీవికి.. భలే సూటైపోయిన పేరు కదా..?
పవన్ పై వర్మ సినిమా తీస్తుంటే.. వర్మపై పవన్ అభిమాని ఓ సినిమా తీయడం – టాక్ ఆఫ్ ది టౌన్ కాక మరేమిటి? వర్మపై సెటైరికల్ సినిమా తీయాలని చాలామంది అనుకున్నారు. కానీ బురదలో రాళ్లేయడం ఎందుకని… ఆగిపోయారు. కానీ వర్మ బురద కాదు. బురదలో దొర్లే పశువు అనుకున్నాడే ఏమో.. ఓ అభిమాని తిరగబడడానికి సిద్ధమయ్యాడు. దానికి ఫలితమే `పరాన్న జీవి` సినిమా..
పవన్ గురించి వర్మ ఏం తీస్తాడో, ఎన్ని కాక్ అండ్ బుల్ కథలు అల్లబోతున్నాడో ఈజీగా ఊహించేయొచ్చు. కానీ.. వర్మపై పవన్ అభిమాని ఎలాంటి సినిమా తీస్తాడో? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అటు వర్మ తీసే `పవర్ స్టార్`, ఇటు ఆర్జీవిపై తీస్తున్న `పరాన్నజీవి`. రెండూ ఇప్పుడు పోటాపోటీగా `తెర` పడుతున్నాయి. త్వరపడుతున్నాయి.
పవన్ అభిమానుల అండ దండదండలు `పరాన్నజీవి`పై ఉంటాయనడంలో సందేహం లేదు. పపర్ స్టార్ యాంటీ ఫ్యాన్స్ `పవర్ స్టార్` కోసం ఎదురు చూడ్డంలో ఆశ్చర్యం లేదు. అటు పవన్ యాంటీ ఫ్యాన్సా? ఇటు పవన్ అసలైన అభిమానులా? అనేది ఇప్పుడు తేలబోతోంది? రాంగోపాల్ వర్మ అసలైన రంగు – రుచి – వాసన చెప్పడానికి `పరాన్న జీవి` సిద్ధం అవుతోంది. మరి వీటిలో ఎవరిది పైచేయో తెలియాలంటే జస్ట్ ఇంకొన్ని రోజులు ఆగితే సరిపోతుంది.