ఇదిలా ఉంటే ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలు షూటింగ్స్ ఎలా చెయ్యాలా అని ప్రొడక్షన్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి. తెలుగు నుంచి రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రభాస్ 20 ఒకటి. ఈ చిత్ర ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ లాక్ డౌన్ తర్వాత షూట్ ఎలా ప్లాన్ చేశామనేది తెలిపారు.
‘ప్రభాస్ 20 కథానుగుణంగా అబ్రాడ్ లో జరిగే కథ. ఇప్పుడు షూటింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చినా అబ్రాడ్ వెళ్లి షూటింగ్స్ చేసే పరిస్థితి లేదు. సో మా ప్లాన్ ఏమిటంటే షూట్ కి పర్మిషన్స్ ఇవ్వగానే అబ్రాడ్ లో తీయాలన్న ఇండోర్ సీన్స్ కి సంబందించిన సెట్స్ అన్నీ ఇక్కడే వేసుకొని షూట్ చేస్తాం. అలాగే ఈ ప్రాసెస్ లో అబ్రాడ్ షెడ్యూల్ కోసం ఒక 6 నెలలు వేచి చూస్తాం. అప్పటికీ సెట్ కాకపోతే అప్పుడు ఆ సెట్స్ కూడా ఇక్కడ వెయ్యడమా అనేది డిసైడ్ అయ్యి సినిమాని పూర్తి చేస్తాం. ఇదొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు. ఇదే గనుక చేయగలిగితే ఫ్యూచర్ లో అబ్రాడ్ కి వెళ్లకుండా ఇక్కడే సెట్స్ రీక్రియేట్ చేసుకొని షూటింగ్స్ చేసుకోవచ్చని’ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తెలిపారు.
దీని ప్రకారం ఇండోర్ సీన్స్ కోసం 6 నెలలు, ఆ తర్వాత అవుట్ డోర్ వెళ్లినా లేక సెట్స్ వేసి ఇక్కడే తీసినా దానికో 3 నెలలు పైనే పడుతుంది. దీని ప్రకారం ఈ సినిమా 2021 సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నయని ఈ చిత్ర టీం చెబుతోంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ డైరెక్టర్.