Advertisement

‘స్పిరిట్’ లో పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్..?

Posted : October 7, 2021 at 11:04 pm IST by ManaTeluguMovies

పాన్ ఇండియన్ స్టార్ వరుస సినిమాలు అనౌన్స్ లైన్ లో పెడుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. లేటెస్టుగా ప్రభాస్ ల్యాండ్ మార్క్ సిల్వర్ జూబ్లీ మూవీ #Prabhas25 కు సంబంధించిన అధికారిక అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి ”స్పిరిట్” అనే టైటిల్ ను మేకర్స్ కన్ఫర్మ్ చేసినట్లు ప్రకటించారు.

‘స్పిరిట్’ సినిమా గురించి ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ”సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న ‘స్పిరిట్’ తో నా ప్రయాణం కిక్ స్టార్టింగ్” అని డార్లింగ్ పేర్కొన్నారు. ”ఇది నా 25వ చిత్రం. దీన్ని జరుపుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం లేదు. అద్భుతమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో పని చేయడానికి వేచి ఉండలేను. ఇలాంటి అవతారంలో నన్ను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు” అని ప్రభాస్ తన సిల్వర్ జూబ్లీ ప్రాజెక్ట్ గురించి తెలిపారు.

‘స్పిరిట్’ సినిమాలో ఇప్పటి వరకు అభిమానులు కనీసం ఊహించనటువంటి సరికొత్త పాత్రలో ప్రభాస్ ను సందీప్ రెడ్డి వంగా చూపించబోతున్నారని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో డార్లింగ్ పాత్ర ఏమయ్యుంటుందని అందరిలో ఆసక్తి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. ‘స్పిరిట్’ టైటిల్ లోగో లో రెండు పోలీస్ బ్యాడ్జ్ ‘స్టార్స్’ ఉండటం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ఇదే కనుక నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ కి కన్నుల పండుగే అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభాస్ ఇంతవరకూ పోలీస్ పాత్రలో కనిపించడంలేదు. ఇప్పుడు ‘స్పిరిట్’ చిత్రంలో ఖాకీ డ్రెస్ వేయడానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందనునున్న ఈ చిత్రాన్ని టి సిరీస్ – యూవీ క్రియేషన్స్ మరియు సందీప్ వంగా సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాయి. భూషణ్ కుమార్ – వంశీ – ప్రమోద్ – వంగా ప్రణయ్ రెడ్డి దీనికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ‘స్పిరిట్’ చిత్రాన్ని తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడ మండరిన్ జపనీస్ మరియు కొరియా భాషల్లో తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది సందీప్ రెడ్డి – ప్రభాస్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి

కాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పీరియాడికల్ లవ్ డ్రామా ‘రాధే శ్యామ్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ కానుంది. ఇక ప్రభాస్ ‘సలార్’ తో పాటుగా సమాంతరంగా ‘ఆదిపురుష్’ షూటింగ్ కూడా చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ‘ఆది పురుష్’ లో ఆయన రాముడిగా కనిపించనున్నారు. 2022 ఆగస్ట్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న ‘సలార్’ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా సిద్ధం కానుంది. ఇందులో ప్రభాస్ యాంగ్రీ లుక్ లో మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా కనిపించనున్నారు. అలానే నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న పాన్ వరల్డ్ ‘ప్రాజెక్ట్ K’ చిత్రంలో ప్రభాస్ భాగం కానున్నారు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇదే క్రమంలో సందీప్ రెడ్డి వంగా తో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నాడు. ప్రభాస్ లైనప్ చూస్తే ఐదు సినిమాలు కూడా ఐదు భిన్నమైన జోనర్స్ లో రూపొందనున్నాయి. అందులోనూ ప్రభాస్ పాత్రలు కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండనున్నాయి. పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ని నిలుపుకోడానికి ప్రభాస్ భారీ ప్లాన్స్ చేస్తున్నట్లు అతని లైనప్ చూస్తే అర్థం అవుతుంది.


Advertisement

Recent Random Post:

మొగలిరేకులు ఫేమ్ పవిత్రనాథ్‌పై షీ టీమ్‌కు ఫిర్యాదు చేసిన భార్య

Posted : October 23, 2021 at 12:09 pm IST by ManaTeluguMovies

మొగలిరేకులు ఫేమ్ పవిత్రనాథ్‌పై షీ టీమ్‌కు ఫిర్యాదు చేసిన భార్య

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement