ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రాధేశ్యామ్ 10 వేల స్క్రీన్స్ కన్ఫర్మ్

ప్రభాస్.. పూజా హెగ్డేల కాంబోలో రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన రాధేశ్యామ్ సినిమా భారీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా అరుదైన రికార్డు ను నమోదు చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా పది వేల స్క్రీన్స్ లో మొదటి రోజు స్క్రీనింగ్ చేయబోతున్నారట. ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలు కాకుండా ఏ ఇతర భాషల సినిమాలు.. ఏ ఇండియన్ సినిమా కూడా ఈ స్థాయి రిలీజ్ కాలేదట. బాలీవుడ్ సినిమాలకు కూడా దక్కని భారీ బాహుబలి రిలీజ్ కేవలం రాధేశ్యామ్ కు దక్కబోతుందనే చర్చ జరుగుతుంది.

యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను ఉత్తరాది పంపిణీ హక్కులు ప్రముఖ నిర్మాతలకు అప్పగించడంతో కేవలం హిందీ వర్షన్ రాధేశ్యామ్ ను ఏకంగా నాలుగు వేల స్క్రీన్స్ ల్లో పైగా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇంతటి భారీ రిలీజ్ కు సిద్దం అయిన రాధేశ్యామ్ సినిమా ఖచ్చితంగా అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు. నిజంగానే పది వేల స్క్రీన్స్ లో సినిమా స్క్రీనింగ్ అయితే మొదటి రోజు వసూళ్లలో రాధేశ్యామ్ సరికొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభాస్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే సినిమా ను భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

యూఎస్.. యూకే తో పాటు అరబ్ దేశాల్లో కూడా ఈ సినిమాను ఇండియన్ సినీ అభిమానుల కోసం ప్రేక్షకుల కోసం రాధేశ్యామ్ ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా ఆలస్యం అవడం వల్ల ఇంత భారీ రిలీజ్ కు సాధ్యం అయ్యిందని టాక్ వినిపిస్తుంది.

ఇదే సమయంలో సినిమా వాయిదా పడటం వల్ల మళ్లీ కొన్ని ప్యాచ్ వర్క్ లను కూడా చేస్తున్నారట. కొందరు ముఖ్యమైన నటీ నటులతో ప్యాచ్ వర్క్ షూట్ జరుగుతుందని సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు కాని కొన్ని సన్నివేశాల షాట్స్ విషయంలో కాస్త అసంతృప్తి ఉండటంతో రీ షూట్ కు వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. రాధే శ్యామ్ ప్రతి ఒక్కరు కోరుకునే విధంగా అద్బుతంగా ఉండటం మాత్రమే కాకుండా ఏ ఒక్కరు ఊహించని విధంగా కథ మరియు ట్విస్ట్ లతో సాగుతుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

Exit mobile version