Advertisement

ఈసారి దిశా వంతు.. బాబోయ్ ప్రభాస్

Posted : May 10, 2022 at 12:27 pm IST by ManaTeluguMovies

ప్రభాస్ తిండి ప్రియుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత డైటింగ్ లో ఉన్నా… ఎంత షూటింగ్ లో ఉన్నాకూడా ఇష్టమైన ఆహార పదార్థాలను ఇష్టంగా తినడం ప్రభాస్ కు అలవాటు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాత్రమే కాకున్నా ఎక్కడ ఉన్నా కూడా ప్రభాస్ యొక్క ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పు లు ఉండవు అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఆయన తినడం కాకుండా తన పక్కన ఉన్న వారికి కూడా బాబోయ్ అనేట్లుగా తినిపిస్తూ ఉంటాడు.

గతంలో బాహుబలి సినిమా చేసే సమయంలో రాజమౌళితో పాటు ప్రతి రోజు పది పదిహేను మందికి సరిపోయేంతగా సెట్ కు ప్రభాస్ బాక్స్ వచ్చేదట. సాహో సినిమా సమయంలో శ్రద్ద కపూర్ పలు సందర్బాల్లో ప్రభాస్ యొక్క బాక్స్ గురించి మాట్లాడిన విషయం తెల్సిందే. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ సమయంలో కూడా ప్రభాస్ అతిథి మర్యాదల గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది.

ఆమద్య ప్రభాస్ సలార్ సినిమాలో నటించిన హీరోయిన్ మరియు ఇతర నటీ నటులు కూడా ఆయన బాక్స్ గురించి చర్చించడం జరిగింది. మొత్తానికి ప్రభాస్ తో షూటింగ్ అంటే తిండి విషయంలో బాబోయ్ అన్నట్లుగా ఉంటుందని పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది. అదే మరో సారి ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొంటున్న బాలీవుడ్ స్టార్స్ కూడా ఎక్స్ పీరియన్స్ చేస్తున్నారు.

దీపిక పదుకునే మరియు దిశా పటానీ లకు ప్రభాస్ ఇంటి నుండి వచ్చిన బాక్స్ లు నోరు ఊరించాయట. దాంతో వారి డైటింగ్.. కంట్రోలింగ్ మొత్తం పక్కన పెట్టేసి లాగించేశారట. ఈ విషయాన్ని దిశా పటాని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రభాస్ మా అందరిని తన భోజనంతో చెడ గొడుతున్నాడు అంటూ స్వీట్ కోపం ను ప్రదర్శించింది.

ప్రాజెక్ట్ కే షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్ లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. సినిమా షూటింగ్ చక చక జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్ పూర్తి అయ్యి వచ్చే ఏడాది సమ్మర్ లేదా కాస్త అటు ఇటుగా సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.


Advertisement

Recent Random Post:

ఎన్నికల వేళ..హెలికాప్టర్, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ – Full and Final

Posted : March 22, 2024 at 7:45 pm IST by ManaTeluguMovies

ఎన్నికల వేళ..హెలికాప్టర్, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ – Full and Final

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement