ఇదే తరహాలో ఈ చిత్ర నటీనటుల్ని మరియు టెక్నిషియన్స్ ని ఒక్కొక్కరిగా ఫైనల్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణిని తీసుకోనున్నారని ఇది వరకే వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ రేస్ లో ఏఆర్ రెహమాన్ కూడా చేరారట. ప్రస్తుతం కీరవాణి – రెహమాన్ మధ్య పోటీ నడుస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఏఆర్ రెహమాన్ కి ఇప్పటికే పాన్ వరల్డ్ గుర్తింపు ఉండగా, ఎంఎం కీరవాణికి బాహుబలితో కొంత గుర్తింపు వచ్చింది.
2021 సమ్మర్ నాటికి ఈ చిత్ర సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. దానికితగ్గట్టుగా అన్ని పనులను పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఈ లోపుగా సినిమాలో నటించే వారిని, టెక్నిషియన్స్ ని ఒక్కొక్కరిగా పరిచయం చేసుకుంటూ రానున్నారు. సైన్ – ఫిక్షన్ కథతో రూపొందుతున్న ఈ సినిమాకి సాయి మాధవ్ బుఱ్ఱా మాటలు రాస్తున్నారు.