ఈ విషయంలో సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. పౌరాణిక పాత్రల్లో మెప్పించడం ఎన్టీఆర్ వల్లే కాలేదని తెలిపాడు. ఇద్దరు పెళ్ళాలు, సొంత ఊరు సినిమాల్లో ఎన్టీఆర్ కృష్ణుడిగా డ్రీమ్ సీక్వెన్స్ లో కనిపిస్తే ప్రజలు తిరస్కరించారని, ఎన్టీఆర్ కూడా తాను కృష్ణుడిగా పనికిరానా అని బాధపడ్డారని తెలిపారు. అయితే కెవి రెడ్డి తాను నిరూపిస్తా అని మాయాబజార్ తీసి అందరినీ ఒప్పించారు.
ఇక ప్రభాస్ విషయానికొస్తే రాముడిగా కనిపించే బాడీ లాంగ్వేజ్ తనకు ఉందని, కాకపోతే డైలాగ్ డెలివరీ, డిక్షన్, హావభావాలు పలికించడం సాధ్యమేనా అని ఆయన సందేహం వ్యక్తం చేసారు. రాముడిగా కనిపించడం అంటే అంత తేలికైన విషయం కాదని తేల్చి చెప్పేసారు.